/rtv/media/media_files/2025/01/15/UnoKIWQ3Alub8DlmgGwM.jpg)
Kangana Ranaut's Emergency Photograph: (Kangana Ranaut's Emergency)
నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కు బిగ్ షాక్ తగిలింది. ఆమె నటించి, దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ మూవీ విడుదలను బంగ్లాదేశ్ లో బ్యాన్ చేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఎమర్జెన్సీ మూవీని బంగ్లాదేశ్‌లో బ్యాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవల సరిహద్దు విషయంపై భారత్, బంగ్లా మధ్య అక్కడ వివాదం నెలకొంది. దీంతో అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీ మూవీపై ఆంక్షలు విధించినట్లుగా సమాచారం. బంగ్లాదేశ్‌లో ఇప్పటికే పుష్ప 2, భూల్ భూలయ్యా 3 వంటి సినిమాలను బ్యాన్ చేశారు.
Kangana Ranaut's Emergency Banned In Bangladesh Due To THIS Reason
— TIMES NOW (@TimesNow) January 15, 2025
Read Here: https://t.co/PsEcCDk6sj#KanganaRanaut #Emergency #Bangladesh #TNCards pic.twitter.com/z1mHZth3Ts
1975లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ప్రకటించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ చిత్రాన్ని కంగనా రనౌత్ తెరకెక్కించారు. ఆ సమయంలో దేశంలో చోటు చేసుకున్న పరిమాణాలు, ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాలను మూవీలో చూపించారు. జీ స్టూడియోస్ & మణికర్ణిక ఫిల్మ్స్ సమర్పణలో ఈ చిత్రాన్ని కంగనా రనౌత్, రేణు పిట్టి, ఉమేష్ బన్సాల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో జయప్రకాశ్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, అటల్ బిహారీ వాజ్‌పేయీగా శ్రేయాస్ తల్పడే నటించారు. మహిమా చౌదరి, మిలింద్ సోమన్, తదితరులు కీలక పాత్రల్లో పోషించారు.
జనవరి 17న థియేటర్లలోకి
పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు సెన్సార్ పూర్తి చేసుకుని జనవరి 17న థియేటర్లలోకి రానుంది. కాగా బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న షేక్ హసీనా 2024 ఆగస్టులో దేశం విడిచి భారత్‌లో తలదాచుకున్నారు. ఆ సమయంలో దేశంలో హిందువులు సహా మైనారిటీలపై హింసాత్మక ఘటనలు జరిగాయి. దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది.
తాజాగా ఈ మూవీని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పెషల్ షో వేసుకుని మరీ చూశారు. ఎమర్జెన్సీ టైమ్‌లో జైలు శిక్ష అనుభవించిన అప్పటి కార్మికులను ఈ చిత్రాన్ని వీక్షించేందుకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. సినిమా చూశాక గడ్కరీ మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ మూవీ ద్వారా కంగన అసల చరిత్రను చూపించారని తెలిపారు. ఈ సినిమా చిరస్థాయిలో నిలిచిపోతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా నటీనటులను, మేకర్స్ ను ఆయన అభినందించారు. . ఈ సినిమాను ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నానని గడ్కరీ తెలిపారు.
Also Read : Kate Middleton: క్యాన్సర్ నుంచి బయటపడ్డాను: వేల్స్ యువరాణి!