/rtv/media/media_files/2025/02/26/EraUPTrwhq9Rzri5utiD.jpg)
Devara Japan Release
Devara Japan Release: ఎన్టీఆర్ ( Jr NTR ) హీరోగా, జాన్వీ కపూర్( Janhvi Kapoor ) హీరోయిన్‌గా, 'మిర్చి' దర్శకుడు కొరటాల శివ( Director Koratala Siva) తెరెకెక్కించిన భారీ పాన్ ఇండియా మూవీ దేవర (Devara) 27 సెప్టెంబర్ 2024లో విడుదలై బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది. ఒక్క తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో ఈ మూవీ మంచి క్రేజ్ సంపాదించుకుంది.
Also Read: దెయ్యాలతో చెడుగుడు ఆడేస్తాం.. ఎనీ డౌట్స్..?
సూపర్ హిట్ 'దేవర' ఇప్పుడు జపాన్ మార్కెట్‌లో కూడా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా జపాన్ లో మార్చి 27న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రీమియర్ల ద్వారా ఈ మూవీకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తోంది. దేవర జపాన్ క్రేజ్ చూస్తుంటే అక్కడ కూడా భారీ హిట్ సాధించేలా కనిపిస్తోంది.
Also Read: జోరు పెంచిన 'ది రాజాసాబ్'.. టీజర్ లోడింగ్..!
'దేవర 2' పై ఇంట్రెస్టింగ్ అప్డేట్
ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి మ్యూజిక్ పెద్ద ప్లస్ అయ్యింది. అనిరుద్ రవిచందర్ అందించిన పాటలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇక ఈ మూవీకి సీక్వెల్ గా వస్తున్న 'దేవర 2' పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి త్వరలో మూవీ టీమ్ ప్రకటించనుంది. ఈ ఏడాదిలోనే 'దేవర 2' ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: నాని 'గే' నా..? టాలెంటెడ్ హీరోని ట్రాన్స్ జెండర్ చేసారు కదరా..!
తెలుగులో దేవరతో సూపర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్, ఇప్పుడు జపాన్ రిలీజ్ తో మరిన్ని రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి మరి.
Also Read: రా కి రా.. సార్ కి సార్..! గ్రోక్ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!
Man of Masses @Tarak9999 has kick started #Devara promotions with interviews for Japanese media ahead of his visit on March 22nd 🌊
— Devara (@DevaraMovie) February 25, 2025
The countdown begins for the grand release in Japan on March 28th. pic.twitter.com/UwPJLNrQ1I