NTR: మాట నిలబెట్టుకున్న దేవర !

ఎన్టీఆర్ అభిమానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. తాజాగా కౌశిక్ చికిత్స పొందుతున్న చెన్నైలోని అపోలో హాస్పిటల్ కి వెళ్లిన ఎన్టీఆర్ టీమ్ హాస్పిటల్ బిల్ మొత్తం సెటిల్ చేసి డిశ్చార్జ్ కి ఏర్పాట్లు చేశారు.

New Update
ntr fan mother

ntr fan mother

Jr.NTR: సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన మాటని నిలబెట్టుకొని.. పెద్ద మనసు చాటుకున్నారు. క్యాన్సర్ తో బాధపడుతున్న తన అభిమాని కౌశిక్ చికిత్సకు సాయం చేశారు. కౌశిక్ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని డిశ్చార్జి కోసం జూనియర్ ఎన్టీఆర్ టీమ్ రూ. 12 లక్షలు చెల్లించింది. జూనియర్ ఎన్టీఆర్ తరుఫున ఆయన టీమ్ కౌశిక్ు డిశ్చార్జి చేసేందుకు ఏర్పాట్లు చేసింది. దీంతో కౌశిక్ మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. ఈ నేపథ్యంలో కౌశిక్ తల్లి సరస్వతమ్మ జూనియర్ ఎన్టీఆర్ కి కృత జ్ఞతలు తెలియజేశారు. 

RTV కథనాలకు స్పందించిన ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ గతంలో కౌశిక్ అనే తన అభిమాని క్యాన్సర్ ట్రీట్ మెంట్ ఖర్చులు భరి స్తారని అభిమానికి భరోసా ఇచ్చారు. అయితే.. ఆ తర్వాత మాత్రం ముఖం చాటేశారని.. కౌశిక్ తల్లి సరస్వతి  ఆరోపణలు చేసింది. ఎన్టీఆర్ దేవర రీలీజ్ సమయంలో ఈ విధంగా అన్నారని.. సినిమా తర్వాత కనీసం తమను ఎవరూ సంప్రదించ లేదని. తాము ప్రయత్నిస్తే.. ఎవరూ అందుబాటులోకి రాలేదని కూడా ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో సరస్వతి ఆవేదనను RTV ప్రసారం చేసింది. ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై ముఖ్యంగా.. పొలిటికల్ గా మాత్రమే కాకుండా.. ఇండస్ట్రీలో కూడా చర్చ కొనసాగిం ది. ఈ విషయం జూనియర్ ఎన్టీఆర్ దృష్టికి చేరడంతో ఆయన వెంటనే అప్రమత్తమయ్యా రు. తన టీమ్ ని  అలర్ట్ చేసి అవసరమైన మొత్తాన్ని చెల్లించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Renu Desai: నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది..రేణూ దేశాయ్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. దేశంలో జరిగే అన్ని విషయాలపైనా స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె..తనకు రాజకీయాల్లోకి రావాలని ఉందని చెప్పారు. 

New Update
Renu Desai

Renu desai

తనకు రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం ఇంతకు ముందే వచ్చిందని..కానీ పిల్లలు చిన్నవారు కావడం వలన వదులుకున్నానని చెప్పారు రేణూ దేశాయ్. రాజకీయాల్లోకి వెళ్ళడం తన జాతకంలోనే ఉందని అన్నారు. ఇప్పటికీ తనకు అదే కోరికని...కానీ తాను విధి రాతకు వ్యతిరేకంగా ప్రయాణిస్తున్నానని చెప్పుకొచ్చారు రేణు. ఓ పాడ్ కాస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో మాటను బయటపెట్టారు.  సామాజిక సేవ చేయడం అంటే తనకు ఆనందమని...ఏ చిన్నారీ ఆకలితో ఉండకూడదని అనుకుంటానని ఆమె తెలిపారు. అయితే తాను కొంచెం ముక్కు సూటి మనిషిని...స్నేహితులు, పిల్లలతో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తానని...అందుకే వారు తాను పోలిటిక్స్ లో పనికి రానని అంటారని నవ్వూతూ చెప్పారు రేణూ దేశాయ్. 

మోడీ భక్తురాలిని..బీజేపీకే సపోర్ట్..

తాను ఎప్పటికీ మోడీనే సపోర్ట్ చేస్తానని...ఆమె భక్తురాలిని అని నిర్భయంగా చెప్పుకున్నారు రేణు. మన ధర్మం ఎలా బతకాలో, ఎలా నడుచుకోవాలో నేర్పించింది. అందుకే నేను సనాతురాలినే అని చెప్పుకుంటాననన్నారు ఎవరేం అనుకున్నా ఎప్పటికీ తాను బీజేపీకే సపోర్ట్ చేస్తానని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులా తాను ఏదైనా పార్టీలో చేరితే కచ్చితంగా అందరికీ చెప్పే చేస్తానని రేణూ దేశాయ్ అన్నారు. ఇక ఆమె కుమారుడు అకీరా నందన్ గురించి చెబుతూ...ఓజీ సినిమాలో అతను పని చేయడం లేదని తెలిపారు. అకీరా నటన గురించి ఆలోచించిన రోజే నా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెడతా. కొందరు యూట్యూబర్లు మనీ కోసం తప్పుడు థంబ్‌నైల్స్‌ పెడుతున్నారు రేణూ ఆరోపించారు. 

today-latest-news-in-telugu | renu-desai | actress | inter-view

Also Read: WHO: మరో మహమ్మారి తప్పదు-WHO చీఫ్

Advertisment
Advertisment
Advertisment