కంటతడి పెట్టిస్తున్న జానీ మాస్టర్ వీడియో.. వెక్కి వెక్కి ఏడుస్తూ

జానీ మాస్టర్ 37 రోజుల జైలు జీవితం అనుభవించిన తరువాత తాజాగా బెయిల్ పై బయటకు వచ్చాడు. ఇంటికి వెళ్లడంతో ఇన్ని రోజులు తండ్రిని చూడకుండా ఉన్న పిల్లలు ఒక్కసారిగా జానీని హత్తుకున్నారు. ఆపై జానీ భార్య సైతం జానీని హత్తుకుని కంటతడి పెట్టుకుంది.  

New Update
jani master

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో జైలుకు వెళ్లాడు. తనపై పలుమార్లు లైంగిక దాడి చేశాడంటూ లేడీ కొరియోగ్రాఫర్ జానీ పై కేసు పెట్టింది. అంతేకాకండా మతం మార్చుకోమని టార్చర్ పెడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. అలాగే తన ఇంటికి వచ్చి కూడా అత్యాచారం చేశాడంటూ తెలిపింది. దీంతో పోలీసులు జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేశారు. ఇక 37 రోజుల జైలు జీవితం అనుభవించిన తరువాత జానీ తాజాగా బెయిల్ పై బయటకు వచ్చాడు.  

ఇది కూడా చదవండి: నేను పోను బిడ్డో సర్కారు దవాఖానాకు: కేటీఆర్

అయితే జైలు నుంచి బయటకు వచ్చిన జానీ సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు తాను మొదటి సారి కొరియోగ్రఫీ చేసిన హరే రామ్ హరరే రామ్ అనే హిందీ సాంగ్‌ మేకింగ్ వీడియోను అభిమానులతో పంచుకుని థాంక్స్ చెప్పాడు.

37 రోజులు జైలులో నరకం

ఈ మేరకు ఈ 37 రోజులు జైలులో తాను ఎంత నరకం అనుభవించాడో తెలుపుతూ వీడియో పంచుకున్నాడు. ఇంకా తనకు జైల్లో ఉన్నట్లు అనిపిస్తుందని అన్నాడు. అక్కడ ఫుడ్ తినలేకపోయానని.. మనిషి అనేవాడు జీవితంలో ఏ రోజు జైలుకు వెళ్లవద్దని తెలిపాడు. జైల్లో చాలా నరకం అనుభవించినట్లు తెలిపాడు. దీని కారణంగా రెండు రోజులు అయితే తప్ప తాను మామూలు స్థితికి రాలేనని చెప్పాడు.

ఇది కూడా చదవండి: వైసీపీ నేత సజ్జల అరెస్ట్‌పై కోర్టు కీలక తీర్పు!

 కంటతడి పెట్టిస్తున్న ఎమోషనల్ వీడియో

ఈ వీడియో తర్వాత ఇప్పుడు మరో ఎమోషనల్ వీడియో షేర్ చేశాడు. తాను జైలు నుంచి ఇంటికి వెళ్లగానే భార్య, పిల్లల్ని హత్తుకుని బోరున ఏడ్చిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ముందుగా డోర్ తీయగానే ఆయన కొడుకు, కూతురు పరుగెత్తుకొని వచ్చి జానీ మాస్టర్‌ను హగ్ చేసుకున్నారు. 

ఇది కూడా చదవండి:  సీఎం రేవంత్ సర్కార్‌కు ఊహించని షాక్!

ఆపై ఏడుస్తూ కంటనీరు పెట్టుకున్నాడు. ఈ 37 రోజులు తండ్రి లేకుండా జానీ కూతురు ఊహించుకోలేకపోయింది. తండ్రిని తలచుకుంటూ పేపర్ పై బొమ్మలు గీసింది. అందుకు సంబంధించిన పేపర్‌ను తండ్రి రాగానే వెంటనే చూపించింది. అలాగే జానీ తన భార్య సైతం హత్తుకుని కంటతడి పెట్టుకున్నాడు. అయితే ఈ వీడియోను జానీ షేర్ చేస్తూ.. ఈ 37 రోజులలో తన నుంచి చాలా తీసేసుకున్నారన్నారు.

ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బిగ్ రిలీఫ్.. తప్పిన పదవి గండం!

తన కుటుంబం & శ్రేయోభిలాషుల ప్రార్థనలు తనను ఈరోజు ఇక్కడకు చేర్చాయని తెలిపారు. నిజం ఎన్నిరోజులు దాగదు. ఎప్పటికైనా బయటపడుతుంది. తాను బతికున్నంత వరకు ఈ బాధ తన హృదయాన్ని గుచ్చుతూనే ఉంటుందని అన్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఎమోషనల్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Karthik Subbaraj అందుకే గేమ్ ఛేంజర్ డిజాస్టర్ .. అసలు మ్యాటర్ చెప్పిన కార్తిక్ సుబ్బారాజు

డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు రామ్ చరణ్  'గేమ్ ఛేంజర్' పరాజయానికి గల కారణాన్ని బయటపెట్టారు. మొదట తాను శంకర్ కి ఒక డీసెంట్ IAS ఆఫీసర్ కథ చెప్పారట. కానీ ఆ తర్వాత కథను పూర్తి భిన్నంగా మార్చినట్లు తెలిపారు. కార్తీక్ గేమ్ ఛేంజర్ కి కథా రచయితగా చేశారు.

New Update

RRR తర్వాత భారీ అంచనాలతో విడుదలైన రామ్ చరణ్  'గేమ్ ఛేంజర్' సినిమా ఊహించని ఫలితాన్ని అందించింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో దాదాపు 100 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ మూటకట్టుకుంది. ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే మెగా అభిమానులతో సహా సినీ ప్రియులందరినీ తీవ్ర నిరాశపరిచింది. అయితే ఈ సినిమా పరాజయానికి గల కారణాన్ని బయటపెట్టాడు డైరెక్టర్ సుబ్బరాజు. కార్తీక్ సుబ్బరాజు గేమ్ ఛేంజర్ చిత్రానికి కథ రచయితగా వ్యవహరించారు. 

అందుకే ప్లాప్ 

ఇటీవలే తన లేటెస్ట్ మూవీ 'రెట్రో'  ప్రమోషన్స్ లో పాల్గొన్న కార్తీక్ సుబ్బరాజు గేమ్ ఛేంజర్ గురించి కీలక విషయాలు వెల్లడించారు. అయితే మొదట కార్తీక్ ఒక డీసెంట్ IAS ఆఫీసర్ కథను డైరెక్టర్ శంకర్ కు చెప్పారట. కానీ ఆ తర్వాత కథ పూర్తి భిన్నంగా మార్చబడింది. ఇందులో అనేక మంది రచయితలు పాల్గొన్నారు. కథ, స్క్రీన్ ప్లే మొత్తం మార్చబడ్డాయి అని వెల్లండించారు. ఇదిలా ఉంటే 'గేమ్ ఛేంజర్' విడుదలైన మరుసటి రోజు కార్తీక్ సుబ్బరాజు సినిమాను ప్రశంసిస్తూ ట్వీట్ చేయడం గమనార్హం. 

telugu-news | latest-news | cinema-news | game-changer | Ram Charan

Advertisment
Advertisment
Advertisment