Jani Master: జానీ మాస్టర్ కు బిగ్ షాక్.. ఆ పిటిషన్ డిస్మిస్! జానీ మాస్టర్ కు మరో బిగ్ షాక్ తగిలింది. లైంగిక ఆరోపణల కేసులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ను రంగారెడ్డి జిల్లా ఫోక్సో కోర్టు డిస్మిస్ చేసింది. By srinivas 14 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Jani Master: జానీ మాస్టర్ కు మరో బిగ్ షాక్ తగిలింది. లైంగిక ఆరోపణల కేసులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ను రంగారెడ్డి జిల్లా ఫోక్సో కోర్టు డిస్మిస్ చేసింది. ఇక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో చంచల్ గూడ జైల్లో జానీ మాస్టర్ శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఇది కూడా చదవండి: జానీ మాస్టర్ కేసులో ఊహించని మలుపు.. చేసిందంతా ఆ అమ్మాయే? బెయిల్ మంజూరు చేయలేం.. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టులో బెయిల్ కావాలని జానీ మాస్టర్ పిటీషన్ దాఖలు చేశారు. అయితే పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం కేసు దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయలేమని స్పష్టం చేసింది. బెయిల్ పిటీషన్ ను రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది కూడా చదవండి: బిగ్‌బాస్ బ్యూటీ ప్రైవేట్ వీడియో లీక్ వైరల్.. ఎంజాయ్ చేసుకోమని రిప్లై మైనర్ గా ఉన్నప్పుడే లైంగిక దాడి.. ఇక జూనియర్ మహిళా కొరియోగ్రాఫర్ జానీపై అత్యాచారం కేసు పెట్టిన విషయం తెలిసిందే. మైనర్ గా ఉన్నప్పుడే తనపై లైంగిక దాడి చేశాడని పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా.. మైనర్ ను అత్యాచారం చేశాడన్న కేసులో పోక్సో చట్టం కింద జానీ మాస్టర్ పై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే చంచల్ గూడ జైల్లో రిమాండ్ లో ఉన్నాడు జానీ మాస్టర్. ఈ క్రమంలోనే తమిళంలో 'తిరుచిత్రాంబళం' సినిమాకు బెస్ట్ కొరియోగ్రఫీగా జాతీయ అవార్డును ప్రకటించారు. అక్టోబర్ 18వ తేదీన జరగబోయే అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. దీంతో అవార్డు కోసం బెయిల్ కావాలని జానీ పిటీషన్ వేశారు. కానీ జాతీయ అవార్డుల కమిటీ జానీ మాస్టర్ అవార్డు ఇవ్వకుండా నిలిపివేసింది. ఇది కూడా చదవండి: Hindupuram : అత్తా కోడళ్ల అత్యాచారం కేసు..ఇద్దరు నిందితుల అరెస్ట్! ఇది కూడా చదవండి: Arjun-Pawan Kalyan:అల్లు అర్జున్ పేరెత్తిన పవన్.. ఏమన్నాడో తెలుసా? #rape-case #jani-master #jani master case మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి