/rtv/media/media_files/2025/03/19/KGx3GbhGSdy0HHRY6caS.jpg)
శ్రీకాంత్ హీరోగా వచ్చిన మహాత్మ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న నటి భావన. తెలుగు, తమిళ్, మళయాళీ బాషల్లో నటించిన ఈ బ్యూటీ 7 సంవత్సరాల క్రితం కన్నడ నిర్మాత నవీన్ ను పెళ్లి చేసుకుంది.వివాహం తర్వాత కూడా భావన మీనన్ సినిమాల్లో నటిస్తూనే ఉంది. అయితే కొన్ని రోజులుగా వైవాహిక బంధానికి ఆమె స్వస్తి పలకనున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది.తాజాగా దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చారు.
విడాకుల వార్తల్లో ఎలాంటి నిజం లేదని వెల్లడించింది. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆ ఊహాగానాలను తోసిపుచ్చింది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకోవడానికి ఇష్టపడనంది. "నేను నా భర్తతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయనందుకే తాను విడాకులు తీసుకున్నానని ప్రచారం జరిగింది. అందులో ఎలాంటి నిజం లేదు. మేము కలిసి ఉన్నాం. కానీ నేను నా గోప్యతను విలువైనదిగా భావిస్తున్నాను. వారి ఊహాగానాల కోసం నేను సెల్ఫీలు దిగి పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు" అని ఆమె వెల్లడించారు.
మలయాళ చిత్రంతో సినిమాల్లోకి
భావన తన నటనా జీవితాన్ని మలయాళ చిత్రం నమ్మల్ (2002)తో ప్రారంభించింది. తరువాత మిస్కిన్ దర్శకత్వం వహించిన చితిరం పెసుతడితో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది.అజిత్‌తో కలిసి వెయిల్, దీపావళి, కూడల్ నగర్, ఆర్య, రామేశ్వరం, వాజ్త్తుగల్, ఆసల్ వంటి ప్రముఖ చిత్రాలలో నటించింది. అజిత్ నటించిన ఆసల్ తర్వాత ఆ నటి కోలీవుడ్ సినిమాల్లో కనిపించలేదు. తాను 16 సంవత్సరాలుగా తమిళ సినిమాలో నటించలేదన్న భావన.. మంచి అవకాశం వస్తే నటిస్తానంది. వివిధ కారణాల వల్ల, కొన్ని సినిమా అవకాశాలు మిస్ అయ్యాయని తెలిపింది. తమిళంలో తనకు ఇష్టమైన సహనటుడు జయం రవి అని భావన వెల్లడించింది. తనకు కోలీవుడ్‌లో చాలా మంది స్నేహితులు ఉన్నారని తెలిపింది.
Also Read : సొంత బ్యానర్ లో మెగా డాటర్ మరో మూవీ.. డైరెక్టర్ ఎవరో తెలుసా?