Jr NTR : సైఫ్ అలీ ఖాన్పై దాడి... ఎన్టీఆర్ షాకింగ్ రియాక్షన్

స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి ఘటనపై హీరో ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.  సైఫ్‌పై జరిగిన దాడి గురించి విని షాక్‌కు గురయ్యానని ఎన్టీఆర్ తన ట్వీట్ లో తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.

New Update
ntr and saif

ntr and saif Photograph: (ntr and saif)

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి ఘటనపై టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.  సైఫ్‌పై జరిగిన దాడి గురించి విని షాక్‌కు గురయ్యానని ఎన్టీఆర్ తన ట్వీట్ లో తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఎన్టీఆర్‌ చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది.  ఎన్టీఆర్‌  నటించిన పాన్-ఇండియా చిత్రం దేవరలో సైఫ్  విలన్ గా నటించారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం తెల్లవారుజామున 3 :30 గంటల ప్రాంతంలో ముంబైలోని  బాంద్రా వెస్ట్‌లోని సైఫ్ అలీఖాన్‌ నివాసంలో ఓ దొంగ సైఫ్ అలీ ఖాన్పై  దాడికి దిగాడు.  ఆర్థరాత్రి ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లో దొంగతనం చేసి పారిపోతుండగా పనిమనిషికి చిక్కాడు.  దీంతో దొంగకు, పనిమనిషికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 

పనిమనిషిని కాపాడేందుకు ప్రయత్నం

ఈ క్రమంలో ఇంట్లో నిద్రపోతున్న సైఫ్ వెంటనే లేచి చూసి పనిమనిషిని కాపాడేందుకు ప్రయత్నం చేయగా దుండగుడు కత్తితో  సైఫ్ పై ఎటాక్ చేశాడు.  ఆరు సార్లు సైఫ్ ను కత్తితో పొడిచి దుండగుడు అక్కడినుంచి పారరయ్యాడు.  వెంటనే  సైఫ్ ను ముంబైలోని  లీలావతి ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.ముంబై పోలీసులు, క్రైమ్ బ్రాంచ్‌లు ఈ  ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్న పోలీసులు  నిందితుడిని పట్టుకోవడానికి  అనేక బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు.  

కాగా 2012లో వివాహం చేసుకున్న కరీనా, సైఫ్ ముంబైలోని బాంద్రా వెస్ట్‌లోని సద్గురు శరణ్ భవనంలో నివసిస్తున్నారు. ఈ దంపతుల ఇద్దరు కుమారులు - తైమూర్ (8), జెహ్ (4) ఉన్నారు.  

Also Read :  కరీనా లేని టైమ్ చూసి ఎటాక్..  సైఫ్ అలీ ఖాన్పై దాడి చేసింది వాళ్లేనా?

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RC 16: రామ్ చరణ్ రోరింగ్ టుమారో..పెద్ది గ్లింప్స్ రిలీజ్

మెగా ఫ్యాన్స్ కు రేపు నిజంగానే పండుగ రోజు. అసలే రేపు శ్రీరామ నవమి...దానికి తోడు చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా గ్లింప్స్ ను ఉదయం 11.45 గంటలకు రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ గ్లింప్స్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

New Update
peddi ram charan look

peddi ram charan look

గేమ్ ఛేంజర్ తర్వాత అందరూ ఆసక్తి చూస్తున్న రామ్ చరణ్ సినిమా పెద్ది. ఇప్పటికే చరణ్ ఫస్ట్ లుక్ తో ఈ సినిమాపై హైప్స్ పెంచేసిన మూవీ దర్శకుడు బుచ్చిబాబు తాజాగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేస్తానంటూ పోస్ట్ పెట్టారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరూ దీని కోసం ఆతృతగా ఎదురు చేస్తున్నారు. 

పెద్ది గ్లింప్స్ పై క్రేజీ పోస్ట్ లు..

టైటిల్ ఎంత క్రేజీగా ఉందో ఇందులో చరణ్ లుక్ కూడా అంతే క్రేజీగా చాలా మాస్ అండ్ రస్టిక్ ఉంది. లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో చరణ్ లుక్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది. 'ఉప్పెన' తర్వాత దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకొని ఈ కథను సిద్ధం చేశారు డైరెక్టర్ బుచ్చిబాబు. ఈ పాన్ ఇండియా మూవీకి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పుడు గ్లింప్స్ శ్రీరామ నవమి రోజు విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. పెద్ది' మూవీ గ్లింప్స్ ని ఫస్ట్ షాట్ పేరుతో రిలీజ్ చేయనున్నారు. రేపు (ఏప్రిల్ 6) ఉదయం 11 గంటల 45 నిమిషాలకు విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. దీనిపై తాజాగా రామ్ చరణ్ కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.  గ్లింప్స్ చూసిన తర్వాత సూపర్ ఉత్సాహంగా ఉంది. ఇది మీకు కూడా చాలా నచ్చుతుంది అంటూ అందులో రాశారు. ఈ సందర్భంగా ఓ వీడియోని కూడా షేర్ చేసారు. దీనిపై బుచ్చిబాబు రియాక్ట్ అవుతూ ఏఆర్ రెహమాన్, చరణ్ అదరగొట్టారనే అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టారు.

 

 today-latest-news-in-telugu 

 Also Read: USA: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

Advertisment
Advertisment
Advertisment