జూ.ఎన్టీఆర్ను మళ్లీ అవమానించిన బాలయ్య.. ఫొటోలు వైరల్!

కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ లకు ఘోర అవమానం జరిగింది. బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా  నందమూరి కుటుంబ సభ్యులందరూ కలిసి బాలయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వివిధ పత్రికలకు ప్రకటనలు ఇచ్చారు. కానీ ఇందులో వారి పేర్లను ప్రస్తావించలేదు.

New Update
nbk family

nbk family

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో గౌరవించిన సంగతి తెలిసిందే. నందమూరి కుటుంబంలో పద్మ అవార్డు అందుకున్న రెండో వ్యక్తి బాలయ్యు. అంతకుముందు 1968లో బాలకృష్ణ తండ్రి, దివంగత నటుడు ఎన్టీఆర్ కు పద్మశ్రీ అవార్డు వరించింది. ఎన్టీఆర్ తో పాటుగా అక్కినేని నాగేశ్వరరావు కూడా పద్మశ్రీ అవార్డు ఇచ్చి అప్పటి కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. 

దాదాపుగా 56 ఏళ్ల తరువాత నందమూరి కుటుంబంలో బాలయ్యను పద్మభూషణ్ అవార్డు వరించింది. దీంతో సినీ ఇండస్ట్రీతో పాటుగా నందమూరి అభిమానులు ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో బాలకృష్ణ సోదరుడు హరికృష్ణ తనయులైన కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు సోషల్ మీడియా వేదికగా బాల బాబాయ్ కు కంగ్రాట్స్ అంటూ సంతోషంతో పోస్టులు పెట్టారు.  

ఘోర అవమానం

అయితే తాజాగా కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ లకు ఘోర అవమానం జరిగింది. బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా  నందమూరి కుటుంబ సభ్యులందరూ కలిసి బాలయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వివిధ పత్రికలకు ప్రకటనలు ఇచ్చారు. ఇందులో ప్రతి ఒక్క నందమూరి సోదరులు, సోదరీమణుల కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావించారు. కానీ ఎన్టీఆర్, ఆమె తల్లి శాలినీ పేర్లను ఎక్కాడా కూడా ప్రచురించలేదు. కల్యాణ్ రామ్ పేరును కూడా ప్రస్తావించలేదు కానీ ఆయన తల్లిదండ్రులైన కీర్తి శేషులు హరికృష్ణ, శ్రీమతి లక్మి పేర్లనున్నాయి.

కానీ హరికృష్ణ రెండో భార్య శాలినీ, కొడుకు ఎన్టీఆర్ పేర్లను మాత్రం ప్రస్తావించకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హరికృష్ణ రెండో భార్యగా శాలినీని నందమూరి కుటుంబ సభ్యులు గుర్తించడం లేదనే వాదనలకు మరింత బలం చేకూరింది. ఎన్టీఆర్ రెండో భార్యగా లక్ష్మీపార్వతిని కుటుంబ సభ్యులు పట్టించుకోనట్టే.. శాలినీని కూడా నందమూరి కుటుంబ సభ్యులు పట్టించుకోవడం లేదంటూ  గుసగుసలు వినిపిస్తున్నాయి. 

బాలయ్యకు పద్మభూషణ్ వచ్చాక విషెస్ తెలుపుతూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. అయినప్పటికీ బాలయ్య దిగిరాలేదని.. ఆయన మనసు కరగలేదు అనడానికి ఈ పేపర్ యాడ్స్ ప్రత్యక్ష సాక్ష్యం అంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. 

Also Read :  Japan Invitation : జపాన్‌కు రండి... ట్రంప్‌కు ఆహ్వానం.. ఎందుకంటే!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Jacqueline Fernandez :  జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇంట్లో విషాదం!

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి కిమ్ ఫెర్నాండెజ్ ఈరోజు కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆమె కొంతకాలంగా ముంబైలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

New Update
Jacqueline-Fernandez

Jacqueline-Fernandez

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి కిమ్ ఫెర్నాండెజ్ ఈరోజు కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆమె కొంతకాలంగా ముంబైలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కిమ్స్ ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఆమెను జాక్వెలిన్ దగ్గరుండి చూసుకున్నారు. మార్చి 26న గౌహతిలో రాజస్థాన్ రాయల్స్ , కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో జాక్వెలిన్ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. కానీ తల్లి ఆనారోగ్యం వలన క్యాన్సిల్ చేసుకుంది.

ముంబైలో కిమ్ ఫెర్నాండెజ్ అంత్యక్రియలు

కాగా కిమ్ ఫెర్నాండెజ్ కు మొత్తం నలుగురు సంతానం. కాగా కిమ్ ఫెర్నాండెజ్ మృతి పట్ల జాక్వెలిన్ అభిమానులు సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. కిమ్ ఫెర్నాండెజ్ మలేషియా, కెనడియన్ సంతతికి చెందినది, అయితే ఆమె భర్త ఎల్రాయ్ ఫెర్నాండెజ్ శ్రీలంకకు చెందినవాడు. వీరిద్దరూ1980లలో కిమ్ ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తున్నప్పుడు కలుసుకున్నారు. ఈ రోజు ముంబైలో కిమ్ ఫెర్నాండెజ్ అంత్యక్రియలు జరగనున్నాయి.  

Also Read :  TG News: సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్!

 

Advertisment
Advertisment
Advertisment