12ARailwayColony Teaser: అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ టీజర్ చూశారా?

అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించి టీజర్, మూవీ టైటిల్‌ను ప్రకటించింది. హర్రర్ కమ్ మిస్టరీ థ్రిల్లర్‌గా ఉండే ఈ సినిమాకి టీం 12 ఏ రైల్వే కాలనీ అని టైటిల్‌ను ఫిక్స్ చేసింది. అలాగే టీజర్‌ను కూడా విడుదల చేసింది.

New Update

కామెడీ నేపథ్యంలో సినిమాలు చేసే అల్లరి నరేష్ ప్రస్తుతం సీరియస్ జోనర్‌లో ఉండే సినిమాలు ఎక్కువగా చేస్తున్నాడు. వీటిలో హిట్‌లు కంటే ఫ్లాప్‌లే ఎక్కువగా ఉంటున్నాయి. కానీ వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్లిపోతున్నాడు. అయితే అల్లరి నరేష్ నటిస్తున్న కొత్త మూవీ టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. నాని కాసరగడ్డ దర్శకత్వంలో వస్తున్న మూవీ టైటిల్‌ను 12 ఏ రైల్వే కాలనీ అని మూవీ టీం ప్రకటించింది. అయితే టీజర్‌తో అల్లరి నరేష్ భయపెట్టేశాడు. టీజర్ చూస్తుంటే వణుకు పుడుతోంది. అంత భయంకరంగా టీజర్ ఉంది. హర్రర్ సినిమాతో అల్లరి నరేష్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 

ఇది కూడా చూడండి: Trump-Biden: బైడెన్ చేసిన క్షమాభిక్షలు చెల్లవు అంటున్న ట్రంప్!

ఇది కూడా చూడండి: Tulsi Gabbard: భారత్ లో ఉంటే ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది

కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటిస్తున్న..

టీజర్ విషయానికొస్తే ఆత్మలు కొందరికే ఎందుకు కనిపిస్తాయనే డైలాగ్‌తో స్టార్ట్ అయ్యి.. ప్రాణాలతో బయటకు పోవుడు అవసరం లేదంటూ ఎండ్ చేశారు. ఈ టీజర్‌లో నరేష్ చెప్పిన డైలాగ్‌లు కూడా భయపెట్టే విధంగానే ఉన్నాయి. పొలిమేర-1, పొలిమేర-2 రైటర్‌గా వ్యవహరించిన అనిల్ విశ్వనాథ్ ఈ షోకు రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందులో కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌‌గా నటిస్తోంది. సాయికుమార్, వైవా హర్ష, సద్దాం, జీవన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అయితే టీజర్ చూస్తుంటే వణుకు పుట్టించే హర్రర్ కమ్ మిస్టరీ థ్రిల్లర్‌గా ఉంది. ఎక్కువగా దెయ్యాలు, చేతబడి వంటి నేపథ్యంలోనే సినిమా తీస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి టీజర్ అయితే అదిరిపోయింది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. 

ఇది కూడా చూడండి: IPL 2025: రోహిత్ శర్మ కెప్టెన్సీపై పంజాబ్ కింగ్స్ బ్యాటర్ షాకింగ్ కామెంట్స్.. తన కోరిక అదేనంటూ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు