కోలీవుడ్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఈ సినిమాకి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు.
ఇది కూడా చూడండి: Bengaluru : పాపం.. అలోవెరా జ్యూస్ అనుకొని పురుగుల మందు తాగింది!
Maamey!
— P V R C i n e m a s (@_PVRCinemas) April 4, 2025
THE MASS CELEBRATION is here 🤩#GoodBadUglyTrailer out now ❤🔥#GoodBadUgly Grand release worldwide on April 10th, 2025 with VERA LEVEL ENTERTAINMENT 💥💥 pic.twitter.com/59HFg16qS8
ఇది కూడా చూడండి: TG Crime : ఏం మనిషివిరా నువ్వు..ఆరోగ్యం బాలేక.. స్నేహితుడిని నమ్మి కూతుర్ని అప్పగిస్తే!
డిఫరెంట్ గెటప్స్‌లో..
అజిత్ కుమార్‌ను ఫ్యాన్స్ ఎలా చూడాలని అనుకున్నారో.. అలాగే మాస్ లుక్‌లో కనిపించాడు. గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైలర్ అయితే అదిరిపోయింది. రెండు నిమిషాల ఈ వీడియోలో క్రేజీ యాక్షన్ రైడ్‌ను డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ చూపించారు. వివిధ గెటప్స్, డిఫరెంట్ లుక్స్‌లో ప్రెజెంట్ చేశారు. ఓవైపు మాస్ లుక్‌లో చూపిస్తూ.. మరోవైపు స్టైలిష్ యంగ్ లుక్‌లో కనిపించారు. టైటిల్ కు తగ్గట్లుగానే హీరో పాత్రలో భిన్నమైన కోణాలున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Earthquake: మరోసారి భూకంపం.. బయటకు పరుగులు తీసిన ప్రజలు- ఈసారి ఎక్కడంటే?
ఈ సినిమాలో అర్జున్ దాస్ విలన్‌గా విభిన్నమైన గెటప్‌లో కనిపించగా.. సిమ్రాన్, ప్రియా ప్రకాష్, సునీల్, జాకీ ష్రాఫ్, ప్రసన్న, ప్రభు, యోగి బాబు, కింగ్స్లీ కీలక పాత్రల్లో నటించారు. ఉషా ఉతుప్, రాహుల్ దేవ్, రోడీస్ రఘు, ప్రదీప్ కబ్రా, హ్యారీ జోష్, KGF అవినాష్, టిన్ను ఆనంద్, సాయాజీ షిండే తదితరులు ఇతర సపోర్టింగ్ పాత్రలు పోషించారు. ట్రైలర్ లో మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.