Balayya: నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు?

నందమూరి అభిమానులు త్వరలోనే ఓ గుడ్ న్యూస్ వినబోతున్నారు. బాలయ్యను పద్మ భూషణ్ వరించనుందట. ఈ ఏడాది ఏపీ ప్రభుత్వం తరఫున పద్మభూషణ్‌ అవార్డుకు గాను సినీ పరిశ్రమ నుంచి నందమూరి బాలకృష్ణ పేరుని ఎంపిక చేసి కేంద్రానికి పంపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

New Update
balya

నందమూరి అభిమానులు త్వరలోనే ఓ గుడ్ న్యూస్ వినబోతున్నారు. వారి అభిమాన హీరో బాలకృష ను పద్మ భూషణ్ వరించనుందట. ఈ న్యూస్ అటు సినీ ఇటు రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇటీవలే సినీ రంగంలో 50 వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న బాలయ్య.. తన కెరీర్ లో 108 సినిమాలు చేశారు. అలాగే బుల్లితెరపై వ్యాఖ్యాతగానూ 'అన్ స్టాపబుల్' షోతో రికార్డు క్రియేట్ చేశారు. ఇటు రాజకీయాల్లోనూ చక్రం తిప్పుతున్నారు. 

ఏపీలో హిందూపూర్ ఎమ్మెల్యే గా ప్రజలకు సేవ చేస్తున్నారు. ఒకే నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు యునానిమస్ గా ఎమ్మెల్యే గా గెలిచి హ్యాట్రిక్ క్రియేట్ చేశారు. అలాగే తన తల్లి బసవతారకం పేరిట క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించి ఎంతో మంది పేదలకు ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన అందిస్తున్న సేవలను ప్రభత్వం గుర్తించి త్వరలోనే బాలయ్యకు పద్మ భూషణ్ పురష్కారం అందజేయనుందట.

Also Read : సెల్ఫ్ ఎలిమినేట్ అయిన మణికంఠ.. 7 వారాల్లో అన్ని లక్షలు సంపాదించాడా?

చిరు తర్వాత బాలయ్యే..

సినీ పరిశ్రమ నుంచి  ఈ పురష్కారం ఇటీవలే మెగాస్టార్ చిరంజీవికి దక్కింది. ఇప్పుడు బాలయ్య వంతు వచ్చింది. ప్రతి ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మా పుష్కరాలు అందజేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈసారి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఈ పురస్కారాలు అందనున్నాయి. 

Also Read : దేశాలు దాటిన రామ్ చరణ్ క్రేజ్.. 'గేమ్ ఛేంజర్' సాంగ్ కు కొరియన్స్ డ్యాన్స్

అయితే ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పద్మభూషణ్‌ అవార్డుకు గాను సినీ పరిశ్రమ నుంచి నందమూరి బాలకృష్ణ పేరుని ఎంపిక చేసి కేంద్రానికి పంపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త విన్న సినీ విశ్లేషకులు పద్మ భూషణ్ అవార్డుకు బాలయ్య అర్హుడని అభిప్రాయపడుతున్నారు. 

Also Read :  నాగ చైతన్య, శోభిత పెళ్లి సందడి షురూ.. వైరల్ అవుతున్న ఫొటోలు!

Also Read :  కరివేపాకు నీటితో ఎంతటి పొట్ట అయినా కరగాల్సిందేనా?

Advertisment
Advertisment
తాజా కథనాలు