Raaka : అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళ బ్యూటీ.. ఎవరీ ఫెమినా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రాకా.  ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తోంది.

New Update
Allu arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రాకా.  ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించబోతుంది. మలయాళ సూపర్ హిట్ చిత్రం మిన్నల్ మురళి ద్వారాఅందరి ప్రశంసలు అందుకున్న నటి ఫెమినా జార్జ్  ఈ సినిమాలో ఆఫర్ కొట్టేసింది.

ఈ సినిమాలో ఆమె ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా కన్ఫర్మ్ చేసింది. తాజాగా తను నటించిన మ్యూజికల్ హారర్-కామెడీ చిత్రం కరక్కం ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో ఫెమినా మాట్లాడుతూ..  "అల్లు అర్జున్ తో కలిసి నటించే అవకాశం వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. నా కెరీర్‌లో ఇప్పటివరకు ఇదే అత్యంత సంతోషకరమైన, అతిపెద్ద క్షణం అంటూ ఎమోషనల్ అయ్యింది.

ఎంతో ఎగ్జైట్‌మెంట్‌తో

అల్లు అర్జున్ సరసన నటించడంపై ఫెమినా ఎంతో ఎగ్జైట్‌మెంట్‌తో ఉంది. "నేను చిన్నప్పటి నుండి అల్లు అర్జున్ గారి ఫ్యాన్‌ని. ఆయన నటించిన ‘హ్యాపీ’ సినిమా నేను చూసిన మొదటి బన్నీ సినిమా. అప్పటి నుండి ఆయన వర్క్‌ని ఫాలో అవుతున్నాను. ఇప్పుడు ‘పుష్ప’ స్టార్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఒక కలలా ఉంది. ఈ సినిమాలో నా పాత్ర నిడివి చిన్నదైనప్పటికీ.. ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగమవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చింది.

రాకా ఇండియన్ సినిమాలోనే అత్యంత భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రాలలో ఒకటిగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ పలు విభిన్న అవతారాలలో  కనిపించనున్నారు. ఇప్పటికే బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్‌కు సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వచ్చింది. కళ్లకు కాటుక, సన్నబడిన జుట్టు, గ్రే గడ్డం,  చేతికి పంజాలాంటి గోళ్లతో ఉన్న బన్నీ లుక్ సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Advertisment
తాజా కథనాలు