Pushpa2: బన్నీని ఏకి పారేస్తూ జానపద సాంగ్.. లిరిక్స్ వింటే అసలు మేటర్ అర్ధవుతుంది!

అల్లు అర్జున్ 'పుష్ప2' ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడం సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో సంధ్యా థియేటర్ ఘటన పై ఓ సెటైరికల్ ఫోక్ సాంగ్ నెట్టింట వైరలవుతోంది. టికెట్లు మేమే కొనాలే.. సావులు మేమే సావాలే అంటూ ఈపాట సాగుతుంది.

New Update
allu arjun satirical song

allu arjun satirical song

Pushpa 2:  అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో ఒక మహిళ చనిపోగా.. ఆమె 9 ఏళ్ళ కుమారుడు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. దీంతో ఈ ఘటనకు సంబంధించి హీరో అల్లు అర్జున్ పై భారీ ఎత్తున విమర్శలు వెలువెత్తాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంపై చాలా సీరియస్ అయ్యింది. ఇకపై బెనిఫిట్ షోలకు, టికెట్ల పెంపుకు ఏ మాత్రం అనుమతి ఇవ్వబోమంటూ తేల్చి చెప్పారు. 

Also Read: డెడ్ బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. శవం దొరకలేదని అమాయకుణ్ని హతమార్చారు?

అల్లు అర్జున్ పై సెటైరికల్ సాంగ్ 

ఈ క్రమంలో ఈ ఘటనకు సంబంధించి నెట్టింట్లో ఓ సెటైరికల్ సాంగ్ వైరల్ అవుతోంది. 'టికెట్లు మేమే కొనాలే.. సప్పట్లు మేమే కొట్టాలే.. సావులు మేమే సావాలే.. సంపాదన మీదే కావాలి'  అంటూ సంధ్యా థియేటర్ ఘటనను ఉద్దేశిస్తూ ఈ పాట లిరిక్స్ సాగుతాయి. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. సింగర్ ప్రభా ఈ సాంగ్ పాడగా.. రవళి ఇందులో నటించారు.చిలుకల శ్రీనివాస్ యాదవ్ లిరిక్స్ అందించారు. 

Also Read: పవన్ ను ఇబ్బంది పెట్టకండి.. ఫ్యాన్స్ కు 'ఓజీ' మేకర్స్ రిక్వెస్ట్

మరోవైపు సంధ్యా థియేటర్ ఘటన తర్వాత  టాలీవుడ్  ఇండస్ట్రీలో చోటుచేసుకున్న పరిణామాలపై పలువురు సినీ ప్రముఖులు, క్రిటిక్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇన్ డైరెక్ట్ గా అల్లు అర్జున్ ఆ రోజు చేసింది తప్పు అన్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ కేసులో అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించగా మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.  ఇది ఇలా ఉంటే.. అల్లు అర్జున్  'పుష్ప2'  మాత్రం వీటితో ఏ మాత్రం సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. విడుదలైన 21 రోజుల్లోనే రూ. 1705 కోట్ల వసూళ్లను రాబట్టింది. 

Also Read: 'పుష్ప2' ర్యాంపేజ్.. ఒక్కరోజులోనే పెరిగిన కలెక్షన్స్, ఎన్ని కోట్లంటే?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు