Gopichand టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్ SVCC(శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర) బ్యానర్ లో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. గోపీచంద్ సూపర్ హిట్ 'సాహసం' తర్వాత రెండోసారి ఈ నిర్మాణ సంస్థతో చేతులు కలిపారు. SVCC 39వ చిత్రంగా ఈ మూవీ రూపొందనుంది. ఈ సందర్భంగా ఈరోజు పూజ కార్యక్రమాలతో సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు. నిర్మాతలు BVSN ప్రసాద్, బాపీనీడు, గోపిచంద్ తదితరులు పూజ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మలయాళ నటి హీరోయిన్ గా
కుమార్ సాయి దర్శకత్వం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్యామ్ దత్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఇందులో గోపిచంద్ సరసన కథానాయికగా మలయాళ నటి మీనాక్షి దినేష్ నటిస్తోంది. మే లేదా జూన్ లో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. సినిమాలోని ఇతర నటీనటుల విషయాలు కూడా త్వరలోనే వెల్లడించనున్నారు.
latest-news | cinema-news | actor-gopichand