/rtv/media/media_files/2024/12/21/Z4cB2qldjwTGc5jIfLHi.jpg)
rgv new year tweet
RGV New Year 2025: దేశమంతా నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. ఏ కష్టాలు, అడ్డంకులూ లేకుండా జీవితం హాయిగా సాగిపోవాలని కోరుకుంటూ ప్రజలు కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరు కొత్త ఏడాదిలో తాము సాధించాలనుకునే గోల్స్ పై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదే విధంగా టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవీ తన న్యూ ఇయర్ రెజెల్యుషన్స్ గురించి తెలియజేస్తూ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
RGV కొత్త సంవత్సరంలో తీసుకున్న 7 తీర్మానాలు
- నేను ఇక నుంచి వివాదాలకు దూరంగా ఉండాలని నిర్ణహించుకున్నాను.
- దేవుడి పట్ల భయం, భక్తిని కలిగి ఉంటాను
- నేను ఒక మంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉండాలని భావిస్తున్నాను.
- ఇక నుంచి ప్రతి ఏడాది 10 సత్య లాంటి సినిమాలు తీస్తాను
- ఎవరిపై నెగిటివ్ ట్వీట్స్ వేయను
- ఆడవారిని అస్సలు చూడను
- వోడ్కా తాగడం మానేస్తాను
పైవన్నీ తూచా తప్పకుండా పాటిస్తానని నాపై తప్ప మీ అందరి పైన ఒట్టేస్తున్నాను అంటూ తన స్టైల్లో న్యూ ఇయర్ విషెష్ తెలియజేశారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Here are a set of 7 new year resolutions I made
— Ram Gopal Varma (@RGVzoomin) December 31, 2024
1.
I will become non controversial
2.
1 will become a family man
3.
I will become god fearing
4.
I will make 10 Satya kind of films every year
5.
I will stop tweeting
6.
I will not look at women
7.
I will stop…
Also Read: Allu Arjun: అల్లు అర్జున్ జోలికి వస్తే చంపేస్తాం! OU జేఏసీ సంచలన ఆరోపణలు