Court Movie: హీరో ఎలివేషన్ షాట్లు, నాలుగు మాస్ ఫైట్స్, నాలుగు పాటలు చేర్చితేనే సినిమాలు చూస్తారనే అపోహ ఇప్పటికీ కొంతమందిలో ఉంటుంది. కానీ, ఇవేవి అవసరం లేదు కథలో కంటెంట్ ఉంటే చాలని మరోసారి నిరూపించింది 'కోర్ట్' మూవీ. మంచి సినిమాను ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారనే దానికి ఇదొక నిదర్శనం. ప్రియదర్శి, హర్ష్ రోషన్ , శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నాని నిర్మించిన 'కోర్టు: స్టేట్ వర్సెస్ నోబడీ' చిత్రం విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటోంది. ఈ సినిమా టిక్కెట్ల అమ్మకాలలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. BookMyShow లో మొదటి రోజే 100K టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అంతేకాదు సినిమాకు ఇంకా డిమాండ్ పెరగడంతో మరిన్ని స్క్రీన్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. విదేశాల్లో కూడా ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది.
Also Read: హనీమూన్ సిస్టిటిస్ అంటే ఏమిటి? కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఈ విషయాలు తెలుసుకోవాలి
JUSTICE SERVED.
— Wall Poster Cinema (@walpostercinema) March 14, 2025
BLOCKBUSTER DELIVERED.
Flying high with success, the #Court team celebrated freedom 🕊️❤️🔥
Book your tickets for #CourtTelugu now!
▶️ https://t.co/C8ZZHbyhHW#CourtStateVsANobody ⚖️ pic.twitter.com/d2qzKv3RiH
సక్సెస్ సెలెబ్రేషన్స్
చిన్న బడ్జెట్ సినిమాగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది 'కోర్టు'. ఈ సందర్భంగా తాజాగా చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఇందులో హీరో నాని, ప్రియదర్శి, మిగతా టీమ్ అంతా పాల్గొన్నారు. తమ ఆనందాన్ని ఒక ప్రత్యేకమైన రీతిలో వ్యక్తం చేశారు. చిత్రబృందమంతా పావురాలను ఆకాశంలోకి ఎగరేసి విజయాన్ని సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాత నాని మాట్లాడుతూ.. ''సినిమాలో కొన్ని అంశాలు చేర్చితేనే ప్రేక్షకులు చూస్తారని అపోహ తరచూ ఉంటుంది. కానీ ఒకే ఒక్క మంచి సినిమా అలాంటి నమ్మకాలను సవాలు చేయగలదని కోర్టు నిరూపిస్తోంది. నా టీమ్ పట్ల నేను చాలా గర్వంగా ఉన్నానని'' ఆనందం వ్యక్తం చేశారు.
మూవీ స్టోరీ
ఒక అమాయకుడిని కేసులో ఇరికించిన కథా నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. అయితే చందు (రోషన్), జాబిలి( శ్రీదేవి)కి ఫోన్ ద్వారా పరిచయం ఏర్పడి.. ఒకరికొనకరు ప్రేమించుకుంటారు. జాబిలి తక్కువ కులం వాడిని ప్రేమించడం ఆమె బావ( శివాజీ) కి నచ్చదు. దీంతో తమ అమ్మాయిని రేప్ చేశాడని చందుని పోక్సో కేసులో ఇరికిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? చందు కేసు నుంచి బయటపడ్డాడా? నేపథ్యంలో కథ ఉంటుంది.
Also Read: అత్యంత దయనీయంగా శ్రీతేజ్ పరిస్థితి.. కనీసం కుటుంబసభ్యులను కూడా గుర్తుపట్టలేని దుస్థితి