Interstellar Re-Release: రీ రిలీజ్ కు రెడీ అవుతున్న నోలన్ మాస్టర్ పీస్ మూవీ "ఇంటర్ స్టెల్లార్"

క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో వచ్చిన మాస్టర్ పీస్, కల్ట్ క్లాసిక్ మూవీ "ఇంటర్ స్టెల్లార్". 10 సం.ల తర్వాత మళ్లీ ఫిబ్రవరి 7న ఈ మూవీ రీ రిలీజ్ కానుంది. ప్రసాద్ మల్టీప్లెక్సులో 10,000 పైగా టికెట్లు సేల్ అయ్యి ఈ మూవీకి ఉన్న క్రేజ్ ఏంటో ప్రూవ్ చేసుకుంది.

New Update
Interstellar Re-Release

Interstellar Re-Release

Interstellar Re-Release: నెగటివ్ రివ్యూలు, మిక్స్డ్ టాక్ తో రిలీజ్ అయిన చాలా సినిమాలు కాలం గడిచేకొద్దీ కల్ట్ క్లాసిక్స్ గా మారిపోతున్నాయి. రీ రిలీజ్ లతో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మన తెలుగు సినిమాల్లో, "ఆరంజ్", "ఓయ్" వంటి సినిమాలు మొదట్లో ఎవరికీ అంతగా ఎక్కలేదు కానీ రీ రిలీజ్ టైంలో అద్భుతమైన కలెక్షన్లు సాధించి అందరికి ఆశ్చర్యం కలిగించాయి. 

ఈ ట్రెండ్ ఓన్లీ తెలుగు మూవీస్ కి మాత్రమే కాదు హాలీవుడ్ చిత్రాలను కూడా తెలుగు ఆడియన్స్ అంతే ఆదరిస్తారు. అందుకు ఉదాహరణ 2014లో వచ్చిన క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో రూపొందిన "ఇంటర్ స్టెల్లార్" సినిమా. నోలన్ సత్తా ఏంటో ప్రపంచ దేశాలకి తెలిసేలా చేసింది ఈ సినిమా. అయితే, మొదట ఈ సినిమా చూసిన వాళ్ళు కంటెంట్ ఏమి అర్థం కాక తలలు పట్టుకున్నారు. కానీ మెల్లమెల్లగా ఈ సినిమా సృష్టించిన బీభస్థం అంతా ఇంతా కాదు. 

Also Read: Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ దాడి కేసులో మరో ట్విస్ట్.. ఎవరీ కొత్త వ్యక్తి..?

ప్రసాద్ మల్టీప్లెక్సులో 10,000 పైగా టికెట్లు సేల్..

అయితే,  "ఇంటర్ స్టెల్లార్" పది సంవత్సరాల యానివర్సరీ సందర్భంగా ఫిబ్రవరి 7న మళ్లీ ఇండియాలో విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే ఇప్పటివరకు 80,000 టికెట్లు అమ్ముడైపోయాయి, ఇది ఈ సినిమాకు ఉన్న క్రేజ్. ఒక్క హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్సులోనే 10,000 పైగా టికెట్లు అమ్ముడైపోవడం అంటే ఈ సినిమాకు ఉన్న డిమాండ్ ఏ  స్థాయిలో ఉందో తెలుస్తోంది.

"ఇంటర్ స్టెల్లార్" ని ఐమాక్స్ స్క్రీన్, అదిరిపోయే సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్లో చుస్తే ఆ కిక్కె వేరు. అందుకనే ప్రేక్షకులు ఐమాక్స్ థియేటర్లలోనే ఎక్కువగా టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. హైదరాబాద్ లోని కొన్ని ఐమాక్స్ థియేటర్స్ లో 24 గంటల పాటు ఈ సినిమాను ప్రదర్శించేందుకు నిర్ణయించిందంటే, ఈ సినిమాకు ఉన్న క్రేజ్ మనం అర్థం చేసుకోవచ్చు.

Also Read: సూపర్ సెల్ తుఫాన్‌తో బ్రెజిల్‌ అతలాకుతలం.. వీడియో వైరల్!

ఈ సినిమా 7 రోజులు పాటు స్క్రీనింగ్ చేస్తారట, అంటే ఎంత ఎక్కువ మంది ఈ సినిమాను చూడాలనుకుంటున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఓటిటిలో ఇలాంటి సినిమాలు చాలానే అందుబాటులో ఉన్నప్పటికీ, "ఇంటర్ స్టెల్లార్" లైవ్ గా థియేటర్‌లో చూడడం అనేది వేరే లెవెల్ ఎక్స్‌పీరియన్స్ అని ఈ మూవీ లవర్స్ ఫీలవుతున్నారు. 

Also Read: Cinema: సీజ్ ద లయన్ అంటున్న రాజమౌళి..ఎస్ఎస్ఎమ్బీ29 షూటింగ్ మొదలైనట్టేనా?

2014లో "ఇంటర్ స్టెల్లార్" $681 మిలియన్ల వసూళ్లు సాధించింది. తరువాత రీ-రిలీజులతో మొత్తం $743 మిలియన్ల వసూళ్లను కలెక్ట్ చేసింది. అందుకే ఈ మూవీ ఒక కల్ట్ హిట్ గా చరిత్రకెక్కింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు