మరో రెండు రోజుల్లో న్యూ ఇయర వస్తోంది. కొత్త సంవత్సరం దగ్గర పడుతున్న వేళ మెగా ఫ్యాన్స్ కు షాకిచ్చే న్యూస్ ఒకటి బయటికొచ్చింది. న్యూ ఇయర్ రోజున థియేటర్స్ లో రీ రిలీజ్ కావాల్సిన మూవీ అనూహ్యంగా వాయిదా పడింది. వివరాల్లోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి క్లాసిక్ మూవీస్ లో 'హిట్లర్' ఒకటి. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1997లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన ఈ మూవీలో చిరంజీవి.. ఐదుగురు చెల్లెళ్లకు అన్నగా కనిపించారు. అప్పట్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ సినిమాను న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న 4కే వెర్షన్ లో రీ-రిలీజ్ చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. The re-release of #Hitler film has been postponed due to technical issues. pic.twitter.com/zm34ZYV7Xs — Telugu Chitraalu (@TeluguChitraalu) December 30, 2024 'సలార్' కు ఫస్ట్ నన్నే అడిగారు.. కానీ? స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ పోస్ట్ పోన్ కు కారణం అదే.. ఆల్రెడీ బుక్ మై షోలో టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అయితే అనుకోని కారణాల వల్ల ఎడిటింగ్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో రీ రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో కొన్ని టెక్నీకల్ ఇష్యుస్ వల్ల సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నాం. మీకు థియేటర్స్ లో బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేందుకు ఎంతగానో కృషి చేస్తున్నాం. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం..' అని పేర్కొన్నారు. ఈ వార్తతో మెగాస్టార్ అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఇదిలా ఉండగా, మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' అనే చిత్రంలో నటిస్తున్నారు. Also Read: నా అసలు పేరు అదికాదు.. ఆ ఇన్సిడెంట్ తో పేరు మార్చుకున్నా : రెజీనా కసాండ్రా ఈ సినిమా మొదట సంక్రాంతి రిలీజ్ కు ప్లాన్ చేసారు. అయితే, కొన్ని అనుకోని కారణాల వల్ల సినిమా వాయిదా పడింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు.