Chhaava: ఛత్రపతి మహారాజ్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్.. 'ఛావా' ఇప్పుడు తెలుగు వెర్షన్ లో కూడా

బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'ఛావా' తెలుగు వెర్షన్ రిలీజ్ కి సిద్ధమైంది. మార్చి7న థియేటర్స్ లో తెలుగు వెర్షన్ విడుదల కానుంది. 'ఛావా' తెలుగు రైట్స్ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కొనుగోలు చేసింది.

New Update

Chhaava: బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ హిస్టారికల్ డ్రామా 'ఛావా'. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. అత్యంత వేగంగా రూ. 100 కోట్ల క్లబ్ లోకి చేరిన తొలి బాలీవుడ్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. హిందీలో మాత్రమే కాదు ఇతర భాషల్లో కూడా ఈ సినిమాకు బలమైన స్పందన వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో  'ఛావా' విపరీతమైన డిమాండ్ పెరగడంతో.. తెలుగు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. 

Also Read: Dil Raju: ఐటీ సోదాల్లో బిగ్ ట్విస్ట్.. దిల్ రాజు సతీమణితో బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయించిన అధికారులు!

గీతా ఆర్ట్స్ కి 'ఛావా' తెలుగు రైట్స్ 

ఛావా తెలుగు రైట్స్ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కొనుగోలు చేసింది. మార్చి 7న తెలుగు డబ్బింగ్ వెర్షన్ థియేటర్ లో విడుదల కానుంది. గీతా ఆర్ట్స్  మద్దతుతో తెలుగు మార్కెట్‌లో ఈ చిత్ర  విజయం మరింత ఉన్నత స్థాయికి  వెళ్లేందుకు సిద్ధంగా ఉంది.  లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరాఠా వీరుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందించబడింది. ఇందులో విక్కీ కౌశల్ శంభాజీ మహారాజ్ పాత్రను పోషించారు. రష్మిక మందన్న ఆయన భార్య యేసుబాయిగా నటించారు. శంభాజీ మహారాజ్ గా విక్కీ నటన సినీ ప్రియులను ఫిదా చేసింది. 

Also Read: This Week Movies: మహాశివరాత్రి స్పెషల్.. థియేటర్, ఓటీటీలో సినిమాల జాతర! లిస్ట్ ఇదే

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు