BIG BREAKING: యాంకర్ శ్యామల, రీతూ చౌదరిలపై కేసు నమోదు

బెట్టింగ్ యాప్‌‌లు ప్రమోట్ చేస్తున్న వారిపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రా్ల్లో సినీ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫూఎసర్లులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

New Update
 betting apps

betting apps Photograph: ( betting apps)

బెట్టింగ్ యాప్‌‌లు ప్రమోట్ చేస్తున్న వారిపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 11 మంది సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్‌, హర్ష సాయి, టెస్టీ తేజ, కిరణ్‌ గౌడ్‌, విష్ణుప్రియ, యాంకర్‌ శ్యామల, రీతూ చౌదరి, బండారు షేషయాని సుప్రీత తదితరులపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.

Also read: Sunita Williams : భూమి మీదకొచ్చాక నడవలేని పరిస్థితిలో సునీతా విలియమ్స్.. చాలా హెల్త్ ప్రాబల్స్

ఇప్పటికే అటు తెలంగాణ పోలీసులు భయ్యా సన్నీ యాదవ్‌ను, ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు లోకల్ బాయ్ నానిలపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. వారిపై 318(4) BNS, 3, 3(A), 4 TSGA, 66D ITA Act-2008 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసి అమాయకులకు అధిక డబ్బులు ఆశ చూపించి ఆర్థికంగా నష్టపోడానికి కారణమైయ్యారంటూ వీరిపై గత కొన్ని రోజులగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బెట్టింగ్ యాప్‌ను నిర్మూలించాలని పోరాటం చేస్తున్నారు. సే నో టూ బెట్టింగ్ యాప్స్ అంటూ బెట్టింగ్ యాప్స్ ‌ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ఆయనతోపాటు నా అన్వేష్, యువ సామ్రాట్‌లు కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్లకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. పలు షోలు, సోషల్ మీడియాతో ఫేమ్ తెచ్చుకున్న వారు బెట్టింగ్ పెట్టి పెద్ద మొత్తంలో డబ్బు సంపాధించవచ్చని యువతకు సూచిస్తున్నారు. బెట్టింగ్ యాప్‌ల వలలో పడి చాలామంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Also read: International Space Station : అక్కడ 24గంటల్లో 16 సార్లు సూర్యోదయం, 16 సార్లు సూర్యాస్తమయం

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు