NBK 111: అదిరిపోయే అప్‌డేట్.. బాలయ్యతో బాలీవుడ్ బ్యూటీ స్పెషల్ సాంగ్!

NBK111లో నందమూరి బాలకృష్ణతో స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీను తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే హీరోయిన్‌గా నయనతార స్థానంలో కాజల్ అగర్వాల్‌ చేరినట్లు టాక్ వినిపిస్తోంది.

New Update
NBK 111

NBK 111

NBK 111: నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ Nandamuri Balakrishna హీరోగా, దర్శకుడుగోపీచంద్ మలినేని Gopichand Malineni తెరకెక్కిస్తున్న కొత్త సినిమా ప్రస్తుతం ‘NBK 111’ అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన వీరసింహారెడ్డి Veera Simha Reddy భారీ విజయం సాధించడంతో ఈ సినిమాపై కూడా అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కొత్త వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య సినిమాల్లో మాస్ పాటలకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే ఈసారి కూడా దర్శకుడు గోపీచంద్ మలినేని ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ పాట కోసం బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రి Nargis Fakhriను ఎంపిక చేసినట్లు సమాచారం. ‘రాక్‌స్టార్’, ‘హౌస్‌ఫుల్ 5’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నర్గీస్ ఫక్రీ ఇప్పుడు బాలయ్యతో కలిసి స్టెప్పులు వేయబోతోందని టాక్ వినిపిస్తోంది.

ఈ మాస్ పాట షూటింగ్‌ను హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో ఈ వారం నుంచి ప్రారంభించనున్నారని సమాచారం. బాలయ్య ఎనర్జీకి తగ్గట్టుగా పవర్‌ఫుల్ స్టెప్స్ ఉండబోతున్నాయని, నర్గీస్ గ్లామర్ ఈ పాటకు మరింత హైలైట్ అవుతుందని మూవీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వార్తతో నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.

ఇక హీరోయిన్ విషయంలో కూడా సినిమా టీమ్‌లో మార్పులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార Nayanthara నటిస్తుందని అధికారికంగా ప్రకటించారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా మూవీ టీమ్ ప్రత్యేక పోస్టర్ కూడా విడుదల చేసింది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో కాజల్ అగర్వాల్‌ Kajal Aggarwalను తీసుకున్నారని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాజల్ ఇప్పటికే షూటింగ్‌లో కూడా పాల్గొన్నట్లు సమాచారం.

నయనతార ఈ సినిమా నుంచి బయటకు రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయని టాక్. ఆమె భారీ రెమ్యునరేషన్ అడగడం, డేట్స్ సర్దుబాటు కాకపోవడం, అలాగే సినిమా ప్రమోషన్స్‌లో ఎక్కువగా పాల్గొనకపోవడం వంటి కారణాలతో నిర్మాతలు కొత్త హీరోయిన్‌ను తీసుకున్నట్టు చెబుతున్నారు.

మరోవైపు కాజల్ అగర్వాల్ మాత్రం తన డేట్స్‌ను సర్దుబాటు చేయడంతో పాటు సినిమా ప్రమోషన్స్‌కు కూడా సిద్ధంగా ఉండటంతో మూవీ టీమ్ ఆమెను ఫైనల్ చేసినట్లు సమాచారం.

ఈ సినిమా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటికే కీలక యాక్షన్ సీన్ల షూటింగ్ పూర్తి చేసిన టీమ్ ఇప్పుడు టైటిల్ ఫైనల్ చేసే పనిలో ఉంది. మరో హీరోయిన్ కూడా సినిమాలో ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నప్పటికీ, దీనిపై ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

ఈ ఏడాది చివర్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు