Ashu Reddy : తప్పుడు ప్రచారం చేస్తే లీగల్‌గా చర్యలు తీసుకుంటా... అషురెడ్డి వార్నింగ్

తనపై వచ్చిన ఆరోపణలపై ప్రముఖ నటి, సోషల్ మీడియా స్టార్ అషురెడ్డి స్పందించారు. తన కుమారుడిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి కోట్లాది రూపాయలు మోసం చేసిందంటూ హైదరాబాద్‌కు చెందిన యెనుముల సత్యనారాయణ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

New Update
ashu reddy

తనపై వచ్చిన ఆరోపణలపై ప్రముఖ నటి, సోషల్ మీడియా స్టార్ అషురెడ్డి స్పందించారు. తన కుమారుడిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి కోట్లాది రూపాయలు మోసం చేసిందంటూ హైదరాబాద్‌కు చెందిన యెనుముల సత్యనారాయణ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెపై కేసు నమోదైంది. హైదరాబాద్‌ షేక్‌పేట్‌కు చెందిన సత్యనారాయణ తన ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు చేశారు. తన కుమారుడు ధర్మేంద్రను వివాహం చేసుకుంటానని అషురెడ్డి నమ్మించిందని, ఈ క్రమంలో దాదాపు రూ. 9.35 కోట్ల విలువైన నగదు, బంగారం, ఖరీదైన కార్లు, ఫ్లాట్లను ఆమె తన పేరిట రిజిస్టర్ చేయించుకుందని ఆయన పేర్కొన్నారు. 

తమ కుటుంబం నుంచి పెద్ద మొత్తంలో ఆస్తులు కాజేసి ఇప్పుడు మోసం చేసిందంటూ ఆయన సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అషురెడ్డితో పాటు ఆమె కుటుంబ సభ్యులపై కూడా పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. 

సహించేది లేదు

అయితే దీనిపై తాజాగా అషురెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ వార్తలు వైరల్‌గా మారడంతో అషురెడ్డి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక స్టోరీని పోస్ట్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు. తన ప్రమేయం లేకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా తనపై తప్పుడు వార్తలు రాసినా లేదా దుష్ప్రచారం చేసినా సహించేది లేదని ఆమె హెచ్చరించారు. "నా గురించి తప్పుడు ప్రచారం చేసే వారిపై, అసత్య వార్తలు రాసే మీడియా సంస్థలపై లీగల్ యాక్షన్ తీసుకుంటాను" అంటూ ఆమె స్టోరీలో పేర్కొన్నారు. 

ప్రస్తుతం ఈ వ్యవహారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు పోలీసులు ఆమెపై వచ్చిన ఆర్థిక నేరాల ఆరోపణలపై విచారణ జరుపుతుండగా, మరోవైపు అషురెడ్డి మాత్రం చట్టపరమైన చర్యలకు సిద్ధమని ప్రకటించడం గమనార్హం. అసలు ధర్మేంద్రకు, అషురెడ్డికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఆ ఆస్తుల బదిలీ నిజంగానే జరిగిందా? అనే విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

ఇక అషురెడ్డి కెరీర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌తోనే మొదలైంది. డబ్‌స్మాష్ వీడియోలతో ఆమె విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత పోలికలతో ఉండటంతో ఆమెను నెటిజన్లు జూనియర్ సమంత అని పిలిచేవారు. ఇదే ఆమెను తక్కువ కాలంలోనే సెలబ్రిటీని చేసింది. అషురెడ్డి కెరీర్‌లో అతిపెద్ద మలుపు బిగ్ బాస్ తెలుగు సీజన్ 3. ఈ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొని తన బోల్డ్ మాట తీరుతో, గ్లామర్‌తో బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆ తర్వాత బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌లోనూ ఆమె మెరిశారు.

Advertisment
తాజా కథనాలు