/rtv/media/media_files/2026/03/10/bigg-boss-9-contestant-demon-pavan-father-dies-2026-03-10-14-04-51.jpg)
bigg boss 9 contestant demon pavan father dies
బిగ్‌బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ డెమాన్ పవన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి దుర్గా ప్రసాద్ మంగళవారం ఉదయం కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. సామాన్యుడిగా బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చిన డెమాన్ పవన్ సీజన్9లో టాప్ 5లోకి వచ్చాడు. తండ్రి దుర్గా ప్రసాద్ కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చి కొడుకును ఎంకరేజ్ చేశారు. ఓవైపు క్యాన్సర్‌తో పోరాడుతూనే కొడుకు బిగ్‌బాస్ టైటిల్ కొట్టాలని గట్టిగా కోరుకున్నారు.
Also read: 8 గ్రాముల బంగారం, పిల్లలకు గోల్డ్ రింగ్, ఫ్రీ బస్సు.. హీరో విజయ్ సంచలన మేనిఫెస్టో!
డిమాన్ పవన్ హౌస్‌లో ఉన్నప్పడు కూడా తండ్రి ఆరోగ్యంపై కలత చెందాడు. తన తండ్రికి క్యాన్సర్ ఉందని.. ఈమధ్యే సర్జరీ జరిగిందని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశాడు. డెమాన్ పవన్ ఫినాలే దాకా వచ్చి టాప్ 3లో నిలిచేందుకు అతని తండ్రి కూడా ఓ కారణమే. బిగ్‌బాస్ హౌస్‌లోకి దుర్గా ప్రసాద్ వచ్చినప్పుడు చాలామంది ఎమోషనల్ అయ్యారు. క్యాన్సర్ వల్ల ఆయన దవడను తొలగించగా మాటలు సరిగ్గా మాట్లాడలేకపోయారు. అయిపనప్పటికీ స్టేజ్ మీదకి వచ్చి తన కొడుకుని ఆశీర్వదించాలని కోరారు. ఈ క్రమంలోనే కొడుకు గురించి చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యారు.
Follow Us