Daaku Maharaaj Day 1 Collections: మాస్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో బాలయ్య నటించిన మూవీ 'డాకూ మహారాజ్'. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ సొంతంచేసుకుంటుంది. ఎప్పటిలాగే సినిమాలో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్, ఎలివేషన్లు, యాక్షన్ సీన్లు థియేటర్స్ లో ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించాయి. బాలయ్య వన్ మ్యాన్ షో అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే సినిమా ఓపెనింగ్స్ కూడా బాగానే జరిగాయి. Also Read: పిల్లల తలపై భోగి పళ్ళు పోయడానికి కారణమేంటి.. పురాణాలలో ఈ కథ గురించి తెలుసా? ఫస్ట్ డే కలెక్షన్స్ ప్రపంచ వ్యాప్తంగా రూ. 170 కోట్ల టార్గెట్ తో విడుదలైన డాకూ మహారాజ్ .. తొలి రోజు మంచి మార్క్ నే నమోదు చేసింది. మొదటి రోజు ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ. 30 కోట్లు వసూళ్లు రాబట్టింది. పండగ సీజన్ కావడంతో ఈజీగా టార్గెట్ ఫినిష్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించింది. అమెరికాలో 1 మిలియన్ అంటే దాదాపు రూ. 8 కోట్లు రాబట్టింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 67కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. నైజాంలో రూ. 17.50 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.5 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ. 5.4 కోట్లు, గుంటూరులో రూ. 7.2 కోట్లు, నెల్లూరులో రూ.2.7 కోట్లు, రాయలసీమలో రూ.15.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8 కోట్లు, తూర్పుగోదావరిలో రూ.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. Also Read: Daaku Maharaaj: బ్లాక్ బస్టర్ డాకూ మహారాజ్.. గుడ్ న్యూస్ చెప్పిన మేకర్స్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ & ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై రూపొందిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ చాందిని చౌదరి, ఊర్వశి రౌతేల ఫీమేల్ లీడ్స్ గా నటించగా.. బాలీవుడ్ బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించారు. ఇప్పటికే అఖండ, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య.. ఇప్పుడు 'డాకూ మహారాజ్' సినిమాతో హ్యాట్రిక్ బ్రేక్ చేశాడని ఫ్యాన్స్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. Also Read: Sankranti 2025: మకర సంక్రాంతికి సరైన పూజ సమయాలివే.. ఆ రోజు ఈ పనులు తప్పక చేయాలి