/rtv/media/media_files/2025/01/26/vgwGIvlsODm57zRdxP85.jpg)
balayya Padma award
Balakrishna Padma Bhushan: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 'పద్మ' పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష కృషి కనబరిచిన వ్యక్తులను అవార్డులకు ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు వరించింది. ఈ సందర్భంగా సినీ, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సహా మరికొందరు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు.
Proud of you Nana! 🙏👏#PadmaBhushan pic.twitter.com/zGI5yLHKBz
— Brahmani Nara (@brahmaninara) January 25, 2025
బాలయ్యకు కొడుకు, కూతుళ్ళ అభినందనలు
తాజాగా బాలయ్య కుమారుడు, కూతుళ్లు కూడా బాలయ్యకు అభినందనలు తెలియజేశారు. తండ్రిని అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. ''అభినందనలు నాన్న, మేము నిన్ను చూసి గర్విస్తున్నాము'' అంటూ పోస్ట్ పెట్టారు మోక్షజ్ఞ. అలాగే నారా బ్రాహ్మీని ''ప్రౌడ్ ఆఫ్ యు నాన్న'' అని ట్వీట్ చేశారు.
Also Read: Balayya Padma Bhushan: జై బాలయ్య.. పద్మ భూషణ్ వేళ అభిమానికి బాలయ్య ఫోన్ కాల్ .. పోస్ట్ వైరల్
/rtv/media/media_files/2025/01/26/obarWOGdWnl01oVP5iBG.jpeg)
అభిమానులకు రుణపడి ఉంటాను..
పద్మ భూషణ్ అవార్డు పై స్పందించిన బాలయ్య ప్రభుత్వానికి, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే తనకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. యాభై ఏళ్ళ సుదీర్ఘ సినీ ప్రయాణంలో పాలు పంచుకున్న తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు యావత్ చలనచిత్ర రంగానికి కృతజ్ఞతలు చెప్పారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నుంచి ఆయన వారసుడిగా నేటి వరకు వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్న అభిమానులకు, ప్రేక్షకలోకానికి సదా రుణపడి ఉంటానని భావోద్వేగానికి గురయ్యారు.
Also Read: Balakrishna Padma Bhushan: బాలయ్య బాబుకు అభినందనల వెల్లువ.. ఎవరెవరు విష్ చేశారంటే?