Jani Master: జానీ మాస్టర్ కు బెయిల్!

లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ కు భారీ ఊరట లభించింది. గత కొద్దిరోజులుగా లైంగిక వేధింపుల కేసులో చంచల్ గూడ జైల్లో మాస్టర్ శిక్ష అనుభవిస్తున్న జానీకి.. తాజాగా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

New Update
jani master case

jani master

Tollywood : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు భారీ ఊరట లభించింది. లైంగిక వేధింపుల కేసులో చంచల్ గూడ జైల్లో మాస్టర్ శిక్ష అనుభవిస్తున్న జానీకి.. తాజాగా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇది ఇలా ఉంటే ఇటీవలే  ఓ సారి నేషనల్ అవార్డు తీసుకోవడానికి జానీకి బెయిల్ మంజూరు చేయగా.. అవార్డు రద్దు కావడంతో  బెయిల్ కూడా క్యాన్సిల్ చేశారు. 

Also Read :  పైనాపిల్ తింటే అంతే సంగతి!

కేసు పెట్టిన మహిళా కొరియోగ్రాఫర్ 

అయితే జానీ మాస్టర్ దగ్గర పనిచేసే ఓ మహిళా కొరియోగ్రాఫర్.. గత కొన్నాళ్లుగా జానీ  తనను  లైంగికంగా వేధిస్తున్నాడని సెప్టెంబర్ 18న నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ఈ మేరకు పోలీసులు జానీ పై IPC 376, 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు బాధితురాలు మైనర్ గా ఉన్నప్పటి నుంచే జానీ ఆమె పై వేధింపులకు పాల్పడ్డాడని తెలియడంతో పోక్సో చట్టం కింద కూడా  కేసు పెట్టారు. గత కొద్ది రోజులుగా కస్టడీలో ఉన్న జానీ మాస్టర్ పలు విధాలుగా విచారించారు. 

Also Read :  ఓటీటీలో కార్తీ, అరవింద్ స్వామి ‘స‌త్యం సుంద‌రం’.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?

జానీకి మద్దతుగా కొరియోగ్రాఫర్స్ 

ఇటీవలే జానీ మాస్టర్ కు మద్దతుగా తోటి కొరియోగ్రాఫర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో లేడీ కొరియోగ్రాఫర్ అనీ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.  జానీ మాస్టర్ దగ్గర తాను రెండేళ్లు వర్క్ చేశానని.. అతను మంచి వ్యక్తి అని తెలిపింది. మీడియా ముందు జానీ మంచివాడు అని చెప్పిన అమ్మాయే కేసు పెట్టడం ఆశ్చర్యంగా ఉందని చెప్పింది. అలాగే జానీ మాస్టర్  నేషనల్ అవార్డును వెనక్కి తీసుకోవడం చాలా బాధాకరమని. నేరం రుజువు కాకముందే కమిటీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరైనది కాదని తన అభిప్రాయాన్ని చెప్పింది. 

Also Read: మా వాడు క్వీన్ ఎలిజబెత్-2 రేంజ్‌! మేడమ్ టుస్సాడ్స్ లో ఆ ప్రత్యేక గౌరవం

Also Read: ఓటీటీలో కార్తీ, అరవింద్ స్వామి ‘స‌త్యం సుంద‌రం’.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?

Advertisment
Advertisment
తాజా కథనాలు