Arjun Son Of Vyjayanthi: 'బింబిసార' తర్వాత ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అర్జున్ S/O వైజయంతి'. అశోక క్రియేషన్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా.. తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు.
A peppy, massy dance number with never seen before moves of @NANDAMURIKALYAN ❤️🔥🥁🕺
— NTR Arts (@NTRArtsOfficial) March 28, 2025
'𝐀𝐑𝐉𝐔𝐍 𝐒/𝐎 𝐕𝐘𝐉𝐀𝐘𝐀𝐍𝐓𝐇𝐈' First Single #Nayaaldhi out on March 31st 💥🕺🏼
In cinemas soon.#ArjunSonOfVyjayanthi@NANDAMURIKALYAN @vijayashanthi_m @saieemmanjrekar @SohailKhan… pic.twitter.com/gdyAkYo90t
పెప్పీ, మాస్ నెంబర్
మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఫస్ట్ సింగిల్ 'నాయాల్ది' సాంగ్ ని మార్చి 31 విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ పెప్పీ, మాస్ నెంబర్ లో కళ్యాణ్ రామ్ మాస్ స్టెప్పులతో అదరగొట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ చిత్రం సమ్మర్ లో విడుదల కానుంది. త్వరలోనే రిలీజ్ డేట్ కూడా ప్రకటించనున్నారు. అజనీష్ లోకనాథ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇటీవలే టీజర్ విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తల్లీ కొడుకుల మధ్య ప్రేమ, వైరం, సెంటిమెంట్, ఎమోషన్స్ నేపథ్యంలో టీజర్ ఆసక్తికరంగా కనిపించింది. పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్ అలరిస్తున్నాయి. ముఖ్యంగా విజయశాంతి , కళ్యాణ్ రామ్ మధ్య సెంటిమెంట్ సీన్స్ హైలైట్ గా అనిపించాయి. ఇందులో విజయశాంతి పోలీస్ ఆఫీసర్ గా నటించగా.. ఆమె కొడుకుగా కళ్యాణ్ రామ్ నటించారు.
latest-news | cinema-news | Arjun Son Of Vyjayanthi Teaser
Also Read: Suma Chaaaat Show: తమన్ చాట్ ఛాలెంజ్.. సుమ కంటెస్ట్ లో విన్ అవ్వడానికి ఇలా చేయండి?