విడాకుల వేళ.. ఏఆర్ రెహమాన్‌కు మరో ప్రతిష్టాత్మక అవార్డు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దంపతుల విడాకుల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో రెహమాన్‌కు మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ‘ది గోట్ లైఫ్’ చిత్రానికి గానూ ఇండిపెండెంట్ ఫిల్మ్ అవార్డును ఆయన అందుకున్నారు. By Seetha Ram 22 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి ఆస్కార్ విజేత, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ భార్య సైరా బాను తన భర్త నుంచి విడిపోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. దీంతో అప్పటి నుంచి వీరి విడాకుల వ్యవహారం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. తమ ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయిందని.. అందువల్లనే ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నానని సైరా బాను తెలిపారు. దీనిపై ఏఆర్ రెహమాన్ కూడా స్పందిస్తూ పోస్టు పెట్టారు. తన భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో సినీ వర్గాలు షాక్ అయ్యాయి. “We had hoped to reach the grand thirty, but all things, it seems, carry an unseen end. Even the throne of God might tremble at the weight of broken hearts. Yet, in this shattering, we seek meaning, though the pieces may not find their place again. To our friends, thank you for… — A.R.Rahman (@arrahman) November 19, 2024 Also Read: 'మెకానిక్ రాకీ' రివ్యూ.. విశ్వక్ యాక్షన్, కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే? మరో ప్రతిష్టాత్మక అవార్డు: ఇలాంటి నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌కి అరుదైన గౌరవం దక్కింది. ‘ది గోట్ లైఫ్’ (ఆడుజీవితం) మూవీకి గానూ ఇండిపెండెంట్ ఫిల్మ్ అవార్డును ఆయన అందుకున్నారు. హాలీవుడ్ మ్యూజిక్ ఇన్ మీడియా అవార్డ్స్‌లో ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించినందుకు గానూ స్కోర్ ఇండిపెండెంట్ ఫిల్మ్ (విదేశీ భాష) విభాగంలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు. This is a monumental moment for not just #TheGoatLife but to Indian cinema. The legend @arrahman did it again… Thank you fans and well-wishers for your unwavering support. Jai Ho @DirectorBlessy pic.twitter.com/UdhnHkPhGL — resul pookutty (@resulp) November 21, 2024 Also Read: జనవరిలోనే పంచాయతీ ఎన్నికలు.. షెడ్యూల్ ఖరారు! లాస్ ఏంజెలీస్‌లో జరిగిన ఈ వేడుకలో రెహమాన్ తరపున ‘ది గోట్ లైఫ్’ దర్శకుడు బ్లెస్సీ ఈ అవార్డును అందుకున్నారు. దీనిపై తాజాగా ఏఆర్ రెహమాన్ స్పందించారు. విదేశీ భాషా సినిమా ‘ది గోట్ లైఫ్’కి బెస్ట్ స్కోర్‌గా అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. Also Read: ఏపీ పెన్షన్ దారులకు గుడ్ న్యూస్.. ఇక ఆ భయం అవసరం లేదు! ఆస్కార్ అవార్డు కైవసం స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రం ‘జయ హో’ సాంగ్ ఎంతటి రెస్పాన్స్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2009లో యావత్ భారతదేశాన్ని ఈ సాంగ్ ఊపేసింది. ఈ సాంగ్‌కు గానూ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌ను 2009లో రెండు ఆస్కార్ అవార్డులు వరించాయి. బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ ఒరిజినల్ కేటగిరీల్లో ఆయన అవార్డు అందుకున్నారు. Also Read: కలెక్టర్ పై దాడి కేసులో కేసీఆర్, కేటీఆర్.. రూ.10 కోట్ల ఖర్చు.. ! ఇవి మాత్రమే కాకుండా రెహమాన్ వందలాది పాటలతో భారతీయ సంగీతప్రియుల్ని మంత్రముగ్ధులను చేసి.. తన కెరీర్‌లో గోల్డెన్ గ్లోబ్ అవార్డులు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, గ్రామీ అవార్డులతో పాటు జాతీయ అవార్డులను అందుకున్నారు. Also Read: రూపురేఖలు మార్చుకోబోతున్న తిరుమల..టీటీడీ ఈవో సంచలన వ్యాఖ్యలు! #movie-news #the-goat-life #ar rehamn divorce #independent film award మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి