బిగ్‌బాస్ నిలిపివేసే విషయంలో మేం జోక్యం చేసుకోలేం: ఏపీ హైకోర్టు

బిగ్ బాస్ రియాల్టీ షో నిలిపివేసే విషయంలో జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. షోలో అసభ్యకరమైన సన్నివేశాలు ఉన్నాయని, రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటలోపు ప్రసారం చేయాలని కేతిరెడ్డి జగదీశ్వరెడ్డి చేసిన వ్యాఖ్యలకు హైకోర్టు తీర్పునిచ్చింది.

New Update
Margadarshi Case: మార్గదర్శికి ఊరట.. ఆ పిటిషన్ ను సస్పెండ్ చేసిన హైకోర్టు

బిగ్ బాస్ రియాల్టీ షోను ప్రజలు ఎక్కువగా వీక్షిస్తుంటారు. ఈ షోపై ప్రజల నుంచి ఎక్కువగానే అభ్యంతరాలు వచ్చాయి. కానీ అంతకంటే ఎక్కువగా బిగ్‌బాస్‌కి ఆదరణ పెరుగుతోంది. అయితే బిగ్‌బాస్ రియాల్టీ షోలో అసభ్యత, అశ్లీలత ఉందని, యువతను తప్పుదారి పట్టేంచే విధంగా ఉన్నాయని సామాజిక కార్యకర్త, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరెడ్డి 2019, 2022ల్లో ఏపీ హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు.

ఇది కూడా చూడండి: SM Krishna: కర్ణాటక మాజీ సీఎం కన్నుమూత

అసభ్యకరమైన సన్నివేశాలు ఉన్నాయని..

అసభ్యకరమైన సన్నివేశలు ఉన్నాయని, బిగ్ బాస్ రియాల్టీ షోని రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల లోపల ప్రసారం చేయాలన్నారు. ఇతను చేసిన వ్యాజ్యాలపై ఏపీ హైకోర్టు తుది తీర్పును ప్రకటించింది. చట్ట నిబంధనల ప్రకారం ఈ షోపై అభ్యంతరాలు చెప్పడానికి ఎన్నో మార్గాలున్నాయని వాటిని వినియోగించాలని ఏపీ హైకోర్టు తెలిపింది. 

ఇది కూడా చూడండి: అలా చేస్తే కఠిన చర్యలు.. రాష్ట్ర సర్కార్ హెచ్చరిక!

బిగ్ బాస్ రియాల్టీ షోని పూర్తిగా నిలిపివేసే విషయంలో జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. కేవలం కొన్ని ఫొటోలతో షోని నిలిపి వేయాలంటే కుదరని తెలిపింది. మీకు ఆ సన్నివేశాలు అసభ్యకరమని అనిపించవచ్చు.. కానీ ఎక్కువ మందికి అది కాదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. 

ఇది కూడా చూడండి:  బట్టలు ఆరేస్తుండగా.. విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి

కొందరికి బిగ్ బాస్ నచ్చక కంప్లైంట్‌లు చేస్తున్నారు. కానీ షో రేటింగ్ మాత్రం తగ్గడంలేదు. ప్రతీ ఒక్కరూ బిగ్ బాస్ షోని చూస్తున్నారు. బిగ్ బాస్‌ రియాల్టీ షోపై ఎన్ని ఫిర్యాదులు వస్తున్న కూడా దేశంలో అన్ని భాషల్లో కూడా నడుస్తోంది. 

ఇది కూడా చూడండి: Road Accident: ముంబైలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Retro Trailer Update: సూర్య 'రెట్రో' ట్రైలర్ వచ్చేస్తోంది..

సూర్య, కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్‌లో రూపొందిన "రెట్రో" మే 1న విడుదలకు సిద్ధమవుతోంది. ఇది యాక్షన్‌తో కూడిన ప్రేమకథగా తెరకెక్కింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా, శ్రియా స్పెషల్ సాంగ్‌లో కనిపించనుండగా, ఈ సినిమా మే 1న  HIT 3, రైడ్ 2తో పోటీ పడుతుంది.

New Update
Pooja Hegde in Retro

Retro Trailer Update

Retro Trailer Update: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజా చిత్రం ‘రెట్రో’తో మళ్లీ వెండితెరపై సందడి చేయనున్నాడు. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. మే 1, 2025న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం ఇప్పటికే మంచి హైప్‌ను సొంతం చేసుకుంది.

Also Read: వీకెండ్ కలెక్షన్స్ లో దుమ్ము దులిపేసిన ‘జాట్’..

అయితే, ఈ సినిమా ఓ గ్యాంగ్‌స్టర్ డ్రామా అని అనుకున్నారు సినీ అభిమానులు. కానీ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ క్లారిటీ ఇస్తూ ఇది యాక్షన్‌తో కూడిన ఓ ప్రేమకథ అని తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “రెట్రో అద్భుతంగా వచ్చింది. ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి,” అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..

ఏప్రిల్ 18న ట్రైలర్‌ రిలీజ్..

ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించి మూడు పాటలు విడుదలవగా, థియేట్రికల్ ట్రైలర్‌ను ఏప్రిల్ 18న రిలీజ్ చేయనున్నారు. అదే రోజున గ్రాండ్ ఆడియో లాంచ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేశారు మేకర్స్.

చిత్రంలో శ్రియా శరణ్ ప్రత్యేక గీతంలో మెరవనుండగా, జోజు జార్జ్, జయరామ్, కరుణాకరన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2D ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై జ్యోతిక, సూర్య కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడిగా సంతోష్ నారాయణన్ పనిచేస్తున్నారు.

Also Read: నరరూప రాక్షసుడిని చూస్తారు.. మే 1న థియేటర్లలో కలుద్దాం: నాని

‘రెట్రో’ మే 1న విడుదలై అదే రోజు బాక్సాఫీస్ వద్ద విడుదలవుతున్న HIT 3, రైడ్ 2 సినిమాలతో పోటీ పడనుంది. సూర్య అభిమానులు ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్న తరుణంలో, ఈ లవ్ – యాక్షన్ ఎంటర్‌టైనర్ ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి! ఇలాంటి మరిన్ని అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి.

Also Read: బాలయ్య ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే న్యూస్..

Advertisment
Advertisment
Advertisment