RGV: ఆర్జీవీకి ఏపీ హైకోర్టు బిగ్ షాక్.. ఏ క్షణమైనా అరెస్ట్?

దర్శకుడు ఆర్జీవికి ఏపీ హైకోర్టులో షాక్‌ తగిలింది. తనను అరెస్ట్‌ చేయకుండా ఆపాలన్న పిటీషన్‌‌పై ఏపీ హై కోర్టు ఇవాళ విచారించింది. అరెస్టుపై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని ఝలక్‌ ఇచ్చింది.

New Update
RGV

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఇటీవల కేసు నమోదు అయింది. గతంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌‌లపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆర్జీవిపై టీడీపీ నేత, మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగం కేసు పెట్టారు.

ఇది కూడా చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్ కొనేవారికి ప్రభుత్వం తీపికబురు.. 100శాతం మినహాయింపు

ఆర్జీవిపై కేసు నమోదు

దీంతో ప్రకాశం జిల్లా మద్ది పాడు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆర్జీవికి నోటీసులిచ్చారు. తనపై నమోదు అయిన కేసును కొట్టేయాలని ఆర్జీవి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఇవాళ విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ఆర్జీవికి గట్టి షాక్ ఇచ్చింది. 

ఇది కూడా చదవండి: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీ మార్పు ఈజీ!

తాజాగా ఏపీ హై కోర్టులో రాంగోపాల్ వర్మకు ఊహించని షాక్‌ తగిలింది. తనను అరెస్ట్‌ చేయకుండా ఆపాలన్న పిటీషన్‌ పై ఏపీ హై కోర్టు రాంగోపాల్ వర్మకు విరుద్ధంగా తీర్పు ఇచ్చింది. ఈ మేరకు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇది కూడా చదవండి: పెళ్లికాని ప్రసాద్‌లే టార్గెట్.. పెళ్లి చేసుకుని లక్షల్లో కన్నం!

ఆర్జీవికి ఏపీ హైకోర్టు ఝలక్‌

ఈ కేసులో అరెస్ట్ నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ దర్శకుడు రాంగోపాల్ వర్మ తరపు న్యాయవాది అభ్యర్థన చేయగా.. దానికి ఏపీ హైకోర్టు తిరస్కరించింది. అరెస్టుపై ఏమైనా ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని ఝలక్‌ ఇచ్చింది. దీంతో ఆర్జీవికి ఏపీ హైకోర్టులో నిరాశ ఎదురైంది.

ఇది కూడా చదవండి: ఫుడ్‌ క్వాలిటీలో హైదరాబాద్‌ లాస్ట్‌...!

ఇది మాత్రమే కాకుండా రేపు కూడా విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆర్జీవికి నోటీసులు ఇచ్చారని.. అయితే హాజరు అయ్యేందుకు మరి కొంత సమయాన్ని ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని పిటిషన్ తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై కూడా ఏపీ హైకోర్టు ఊహించని షాక్‌ ఇచ్చింది. సమయం పొడిగించాలనే అభ్యర్థనను పోలీసులు ముందు చేసుకోవాలని.. కోర్టు ముందు కాదని న్యాయమూర్తి మరో షాక్ ఇచ్చారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Singer Sunitha: ప్రవస్తి ఆరోపణలపై సింగర్ సునీత సంచలన వీడియో.. అసలు నిజం ఇదే!

పాడుతా తీయగా సింగర్ ప్రవస్తి ఆరోపణలపై సింగర్ సునీత రియాక్ట్ అయ్యారు. చిన్నప్పటి నుంచి బాలు గారూ, జానకమ్మ, చిత్రమ్మ నిన్ను ఒడిలో పెట్టుకొని పెంచారు. నేను కూడా నిన్ను ముద్దు చేశా.. చెప్తే అంతా చెప్పమ్మా.. అంటూ వీడియో రిలీజ్ చేసింది సింగర్ సునీత.

New Update

Singer Sunitha: పాడుతా తీయగా సింగర్ ప్రవస్తి ఆరోపణలపై సింగర్ సునీత రియాక్ట్ అయ్యారు.  చిన్నప్పటి నుంచి బాలు గారూ, జానకమ్మ, చిత్రమ్మ నిన్ను ఒడిలో పెట్టుకొని పెంచారు. నేను కూడా నిన్ను ముద్దు చేశా.. చెప్తే అంతా చెప్పమ్మా.. అంటూ వీడియో రిలీజ్ చేసింది సింగర్ సునీత. 

 

Advertisment
Advertisment
Advertisment