సినిమాల్లోనే కాదు..రియల్ లైఫ్‌లోనూ హీరోయిన్ అనిపించుకున్న అనన్య

హీరోయిన్ అనన్య నాగళ్ల మరోసారి తన ఉదార మనస్సును చాటుకుంది. హైదరాబాద్‌లో ఓ బస్టాండ్ దగ్గర నిద్రిస్తున్న కొందరికి స్వయంగా తానే దుప్పట్లు పంపిణీ చేసింది. ఈ వీడియో చూసి నెటిజన్లు సినిమాల్లోనే కాదు..రియల్ లైఫ్‌లోనూ హీరోయిన్ అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

New Update
Ananya Nagalla

తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల నుంచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవర్ స్టార్ నటించిన వకీల్ సాబ్ సినిమాతో ఈమెకు మంచి గుర్తింపు లభించింది. అయితే తెలంగాణకి చెందిన అనన్య ఎప్పుడు పేదలకు సాయం చేస్తూ ముందుంటుంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరదలు వచ్చినప్పుడు కూడా తన వంతుగా రెండు రాష్ట్రాలకు కలిపి రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందించి సేవా గుణాన్ని చాటుకుంది.

ఇది కూడా చూడండి: 10th విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇకపై!

రోడ్డు పక్కన నిద్రిస్తున్న వారికి..

తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కూడా వరదల సమయంలో తెలుగు రాష్ట్రాలకు ఆర్థిక సాయం ప్రకటించలేదు. ఈమె ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ కూడా అభినందించారు. అయితే అనన్య నాగళ్ల మరోసారి పేదలకు సాయం చేసింది. చాలా మందికి ఇళ్లు లేక రోడ్డు పక్కనే నిద్రపోతుంటారు. వీరికి కనీసం దుప్పట్లు కూడా ఉండవు. అందులోనూ ఇది చలికాలం. దుప్పటి లేకుండా బయట నిద్రపోవాలంటే చాలా కష్టం.

ఇది కూడా చూడండి: పొలిటికల్ పవర్ లిస్ట్‌లో టాప్‌-5లో ఉన్న రాజకీయ నాయకులు వీళ్లే!

ఇలాంటి వారికి అనన్య దుప్పట్లు ఇస్తూ తన ఉదార మనస్సును చాటుకుంది. హైదరాబాద్‌లో ఓ బస్టాండ్ దగ్గర దుప్పట్లు లేకుండా నిద్రపోయిన వారికి పంపినీ చేసింది. నిద్రపోతున్న వారికి తానే దుప్పట్లు కప్పుతున్న వీడియోను చూసి నెటిజన్లు అనన్యను పొగుడుతున్నారు. సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ మీరు హీరోయిన్ అని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల అనన్య నాగళ్ల పొట్టేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ ఈమె యాక్టివ్‌గానే ఉంటుంది. 

ఇది కూడా చూడండి: AP Rains: ఏపీపై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో వానలే..వానలు!

ఇది కూడా చూడండి: Pawan Kalyan: పవన్‌ కు మరో కీలక బాధ్యత అప్పగించిన మోదీ!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hit 3 Song: ‘హిట్ 3’ నుంచి అర్జున్ సర్కార్ పవర్‌ఫుల్ సాంగ్.. అనిరుధ్ పాడిన పాట విన్నారా?

నాని ‘హిట్ 3’ మూవీ నుంచి మూడో సాంగ్ రిలీజ్ అయింది. ‘తన కోసమే నా పొగరే’.. అంటూ సాగే ఈ సాంగును మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌ ఆలపించాడు. మిక్కీ జే. మేయర్‌ స్వరాలు అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. 

New Update
HIT 3 new song

HIT 3 new song

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న కొత్త చిత్రం ‘హిట్ 3’. శైలేశ్‌ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ‘హిట్‌’ ఫ్రాంచైజీలో వస్తోన్న మూడో చిత్రం కావడంతో అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి పార్ట్‌లో విశ్వక్ సేన్, సెకండ్ పార్ట్‌లో అడివి శేష్ నటించి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. ఇప్పుడు మూడో పార్ట్‌లో నేచురల్ స్టార్ నాని నటిస్తుండటంతో అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. 

మూడో సాంగ్

ఈ సినిమాలో నాని.. అర్జున్ సర్కార్‌గా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడు. ఈ చిత్రం అన్ని పనులు పూర్తి చేసుకుని మే 1న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసిన మూవీ యూనిట్.. తాజాగా ఈ సినిమాలోని మూడో సాంగ్‌ను రిలీజ్ చేసింది. ‘తన కోసమే నా పొగరే’.. అంటూ సాగే ఈ సాంగును మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌ ఆలపించాడు. మిక్కీ జే. మేయర్‌ స్వరాలు అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. 

Hit 3 Song | actor-nani | Srinidhi Shetty HIT- 3 | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment