Pushpa 2: 'పుష్ప2' కు బలైన మరో ప్రాణం.. థియేటర్ లో అనుమానాస్పద మృతి

అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రాయదుర్గంలో పుష్ప-2 సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ లో ముద్దానప్ప వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే ముద్దానప్ప తొక్కిసలాట వల్లే మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

New Update
pakala beach

Pushpa 2: అల్లు అర్జున్ 'పుష్ప 2' మరో ఇంట విషాదం నింపింది. ఇటీవలే హైదరాబాద్ సంధ్య థియేటర్ ఘటనలో ఓ మహిళ మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన మరవకముందే మరో విషాదం చోటుచేసుకుంది. 

Also Read: ఉర్ఫీ ఫ్యాషన్ చూస్తే అవాక్కవ్వాల్సిందే.. ఫొటోల పై సమంత కామెంట్!

పుష్ప2 థియేటర్ లో అనుమానాస్పద ఘటన.. 

అనంతపురం జిల్లా రాయదుర్గంలో పుష్ప-2 సినిమా స్క్రీనింగ్ చేస్తున్న థియేటర్ లో ముద్దానప్ప అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందారు. షో ముగిసిన తర్వాత కూడా సీట్లో అలాగే కూర్చొని ఉండడంతో.. అది గమనించిన ప్రేక్షకులు థియేటర్ యాజమాన్యానికి దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత అతడిని పరీశీలించగా మృతి చెందినట్లు గుర్తించారు. అయితే ముద్దానప్ప తొక్కిసలాట కారణంగానే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆందోళనకు చేస్తున్నారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Also Read: ఏపీ కూటమిలో యనమల చిచ్చు.. చంద్రబాబునే బ్లాక్ మెయిల్ చేస్తూ..!

Also Read: రచ్చ లేపుతున్న మంచు ఫ్యామిలీ ఫైట్‌.. ముంబై పారిపోయిన మంచు లక్ష్మి!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మహిళలు మృతి

శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ధనపురం క్రాస్‌ వద్ద హైవేపై ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ముగ్గురు మహిళలు స్పాట్‌లోనే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

New Update
ACCIDENT

ACCIDENT

శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ధనపురం క్రాస్‌ వద్ద హైవేపై ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు మహిళలు స్పాట్‌లోనే మ‌ృతి చెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే హిందూపురం ఆసుపత్రికి తరలించారు. కోటిపి చౌడేశ్వరి ఆలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

ముగ్గురు మృతి..

ఇదిలా ఉండగా ఏపీలో ఘోర విషాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలోని సూర్య మహాలక్ష్మి రైస్ మిల్లులో విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి చెందారు. మృతులు కాపవరం గ్రామానికి చెందిన శ్రీరాములు, అన్నవరం, వెంకన్నగా పోలీసులు గుర్తించారు.

ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

ఈ మేరకు కోరుకొండ ఎంపీడీవో ఆఫీస్ వెనక రైస్ మిల్ లోకి శనివారం ఉదయం గోడౌన్ నుండి రైస్ ను ట్రాలిలో రైస్ తీసుకుని వస్తుండగా విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో అక్కడికక్కడే మృతులు ఆకుల శ్రీరాములు (34), పలసాని అన్నవరం (55),జాజుల వెంకన్న (46) చనిపోయారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ.. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఇస్తామని తెలిపారు.

ఇది కూడా చూడండి: TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి

మృతిపై సమగ్ర విచారణ జరిపి రైస్ మిల్ యజమాన్యంపై, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బలరామకృష్ణ  తెలిపారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వం తరఫున రావాల్సిన నష్టపరిహారాన్ని చనిపోయిన మృతుల కుటుంబాలకు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. 

ఇది కూడా చూడండి:  AP Crime News : అక్క ఇంటికే కన్నం వేసిన చెల్లెలు...లక్షల విలువచేసే బంగారంతో…

 

latest-telugu-news | andhra-pradesh-news | road-accident | telugu-news | today-news-in-telugu | telugu crime news

Advertisment
Advertisment
Advertisment