నేడు నాంపల్లి కోర్టుకు అల్లుఅర్జున్ వెళ్లనున్నారు. సంధ్య థియేటర్ ఘటనలో ఇవాళ నాంపల్లి కోర్టులో హాజరుకానున్నారు. గతంలో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అది ఇవాళ్టితో ముగియనుండటంతో కోర్టుకు వెళ్లనున్నారు. నేడు కోర్టుకు హాజరై.. బెయిల్ మంజూరు చేసినట్లు అల్లు అర్జున్ తరఫు లాయర్లు కోర్టుకు తెలపనున్నారు. ALSO READ: విశిష్ట వ్యక్తిని కోల్పోయాం..ప్రధానితో సహా ప్రముఖుల సంతాపం ఆన్‌లైన్‌లో కోర్టు విచారణకు హాజరు కాగా అల్లు అర్జున్ తరఫు లాయర్లు నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని నాంపల్లి కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఆన్‌లైన్‌లో కోర్టు విచారణకు అల్లు అర్జున్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కాగా ఇదే కేసులో అల్లు అర్జున్‌కు హైకోర్టు 4వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అదే క్రమంలో హైకోర్టు సూచనలు చేసింది. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టును సంప్రదించాలని గతంలోనే అల్లు అర్జున్ న్యాయవాదులకు తెలిపింది. ALSO READ: నేడు విద్యాసంస్థలకు సెలవు జరిగిందిదే..? కాగా సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ఆపై నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అల్లు అర్జున్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో అల్లు అర్జున్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. వెంటనే బెయిల్ విషయంలో హైకోర్టును ఆశ్రయించగా.. 4వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ALSO READ: రేవంత్ రెడ్డి గలీజ్‌గా బిహేవ్ చేస్తున్నారు: హీరోయిన్ షాకింగ్ వ్యాఖ్యలు! దీంతో బన్నీ చంచల్‌గూడ జైలు నుంచి ఆ రాత్రే బయటకొచ్చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ మధ్యంతర బెయిల్ మంజూరు కాపీ తమకు ఇంకా అందలేదని జైలు అధికారులు తెలిపారు. దీంతో ఆ రాత్రంతా బన్నీని జైలులోనే ఉంచారు. మరుసటి రోజు విడుదల చేశారు. ALSO READ: పాకిస్తాన్‌లో పుట్టి భారత ప్రధానిగా ఎదిగి... మరోవైపు సంథ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి రూ.2 కోట్ల ఆర్థిక సాయం అందించారు. అల్లు అర్జున్ తరఫున రూ.కోటి, దర్శకుడు సుకుమార్ రూ.50 లక్షలు, నిర్మాతలు రూ.50 లక్షలు అందించారు. అలాగే రేవతి కుమారుడు శ్రీతేజ్ సైతం ఇప్పుడిప్పుడే కోలుకుంటుండటంతో అంతా ఊపిరిపీల్చుకుంటున్నారు.