ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రముఖ నటులలో ఒకరు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బిజినెస్ పరంగా దూసుకుపోతున్నారు. ఇలా మొత్తంగా ఆయన చాలానే సంపాదించినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.460 కోట్ల నికర విలువ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు సినిమాల నుంచి సంపాదించిందే కాకుండా.. వివిధ నిర్మాణాలు, వివిధ రంగాలలో అతను పెట్టిన పెట్టుబడుల నుంచి ఎంత సంపాదిస్తున్నాడో తెలుసుకుందాం. అల్లు అర్జున్ ఒక ప్రైవేట్ జెట్, విశాలమైన బంగ్లా, అనేక ఇతర అధిక-విలువ ఆస్తులను కలిగి ఉన్నాడు. అల్లు స్టూడియో: ఎ డ్రీమ్ ప్రొడక్షన్ హౌస్ 2022లో, అల్లు అర్జున్ హైదరాబాద్‌లో తన సొంత ప్రొడక్షన్ హౌస్ అల్లు స్టూడియోని ప్రారంభించడం ద్వారా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడంలో ముఖ్యమైన అడుగు వేశాడు. 10 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక స్టూడియోని నిర్మించారు. వీరికి అల్లు స్టూడియోతో పాటు ప్రముఖ చిత్ర నిర్మాణ, పంపిణీ సంస్థ గీతా ఆర్ట్స్ కూడా ఉంది. మల్టీప్లెక్స్ వ్యాపార విస్తరణ జూన్ 2023లో అల్లు అర్జున్ హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో తన సొంత మల్టీప్లెక్స్‌ను ప్రారంభించారు. ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో సైతం తన సొంత మల్టీ ప్లెక్స్‌ను ప్రారంభించాలని చూస్తున్నాడు. ది రెస్టారెంట్: బఫెలో వైల్డ్ వింగ్స్ ఫ్రాంచైజ్ అల్లు అర్జున్‌కు విజయవంతమైన రెస్టారెంట్‌లు ఉన్నాయి. హైదరాబాదులోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ప్రముఖ అమెరికన్ స్పోర్ట్స్ బార్, రెస్టారెంట్ చైన్ బఫెలో వైల్డ్ వింగ్స్ ఫ్రాంచైజీ కూడా ఉంది. బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు అండ్ సోషల్ మీడియా ప్రభావం ఇన్‌స్టాగ్రామ్‌లో 25 మిలియన్లకు పైగా సోషల్ మీడియా ఫాలోయింగ్‌తో అల్లు అర్జున్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల కోసం ప్రముఖ వ్యక్తిగా మారారు. అతడు ఒక్కో ప్రమోషనల్ పోస్ట్‌కి సుమారుగా రూ. 4 కోట్లు వసూలు చేస్తాడు. అంతేకాకుండా అతిపెద్ద దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్‌లతో అనుబంధం కలిగి ఉన్నాడు. అతను KFC, Frooti, Rapido, Hero MotoCorp, RedBus, Hotstar వంటి కంపెనీలతో భాగస్వామిగా ఉన్నాడు. ఆహా: అల్లు అర్జున్ OTT ప్రయత్నం నవంబర్ 2020లో అల్లు అర్జున్ తెలుగు, తమిళ కంటెంట్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ఆహాకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. హెల్త్‌కేర్‌లో పెట్టుబడి: కాల్‌హెల్త్ సర్వీసెస్ అల్లు అర్జున్ ఆన్‌లైన్ మెడికల్ కన్సల్టేషన్‌లు, నర్సింగ్ కేర్, డయాగ్నస్టిక్ టెస్ట్‌లు, మెడిసిన్ డెలివరీ, ఇతర ఆరోగ్య సేవలను అందించే హైదరాబాద్ ఆధారిత స్టార్టప్ అయిన కాల్‌హెల్త్ సర్వీసెస్‌లో పెట్టుబడితో హెల్త్‌కేర్ రంగంలో కూడా దూసుకుపోతున్నాడు. ఇలా మొత్తంగా చూసుకుంటే అల్లు అర్జున్ నికర విలువ రూ. 460 కోట్లు అని తెలుస్తోంది. సినిమా కెరీర్, ప్రొడక్షన్, రెస్టారెంట్లు, హెల్త్‌కేర్ వంటి వ్యాపారాలలో పెట్టుబడులు, లాభదాయకమైన బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ఫలితంగా ఇంతటి ఆస్తులు సంపాదించుకోగలుతున్నాడు.