/rtv/media/media_files/2024/11/03/uaJE3Emq5k2g9HAB1Afm.jpg)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప2' కోసం సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. కానీ, ఇప్పటికీ ఇందులోని స్పెషల్ సాంగ్ లో బన్నీతో కలిసి స్టెప్పులేసేది ఎవరన్నది మాత్రం స్పష్టత రాలేదు.
బన్నీతో శ్రీలీల స్టెప్పులు..
ఈ పాట కోసం బాలీవుడ్ హీరోయిన్స్ త్రిప్తి దిమ్రి, శ్రద్ధా కపూర్‌పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడా అవకాశం మాత్రం టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలకు దక్కినట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై ఆమెతో సంప్రదింపులు పూర్తయ్యాయని.. తను కూడా సానుకూలంగా స్పందించిందని తెలుస్తోంది. అంతేకాదు నవంబర్ 6 నుంచి పాట చిత్రీకరణను ప్రారంభించనున్నట్లు సమాచారం.
Sree Leela has been confirmed to perform alongside Stylish Star Allu Arjun in an item song for Pushpa 2. The shooting for the song will begin this coming Wednesday...#AlluArjun #Pushpa2 #Pushpa2TheRule #Sreeleela #sreeleelahot pic.twitter.com/jlHTg7qXtV
— Rishabh Thakur (@rishabhthaakurr) November 2, 2024
Also Read : హౌస్ నుంచి క్రై బేబీ అవుట్.. నాలుగు వారాల రెమ్యునరేషన్ ఎంతంటే?
దీనికోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్‌ను సిద్ధం చేస్తున్నారు. కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ నేతృత్వంలో ఈ సాంగ్ ను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. 'పుష్ప పార్ట్ -1' లో సమంత చేసిన స్పెషల్ సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 'ఊ అంటావా మావా' అంటూ సామ్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
2307-News & Views 16 - It is learnt that 'Special Song Brahma' Sukumar is planning for a bigger & better Item song for PUSHPA-2, with Sreeleela clinging to Pushpa on his lap! (However, since it is PUSHPA-2, it should be appropriate to have two girls!!)@alluarjun @Sreeleelaoffl pic.twitter.com/whr3pqeQsi
— klmurty (@JjDigitha) August 1, 2023
ఈ సాంగ్ తో సమంత కు పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ వచ్చింది. ఇప్పుడు పార్ట్-2 లో అంతకుమించి ప్లాన్ చేశారట మేకర్స్. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా.. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డిసెంబర్ 5 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : మహిళా డాక్టర్ కు బైకర్ వేధింపులు.. శృంగార వీడియోలు పంపిస్తూ!