ఆరేళ్ళ తర్వాత లుక్ మార్చిన అల్లు అర్జున్.. వైరల్ అవుతున్న బన్నీ న్యూ లుక్

గత ఆరేళ్లుగా 'పుష్ప' సినిమా కోసం జుట్టు, గడ్డం పెంచిన అల్లు అర్జున్.. తాజాగా ఆ లుక్‌ను మార్చి సాధారణ హెయిర్‌స్టైల్‌లో కనిపించారు. కోర్టుకు వచ్చిన బన్నీని చాలా రోజుల తర్వాత  సింపుల్ లుక్ లో కనిపించడంతో.. బన్నీ న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

New Update
allu arjun new look

సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు శుక్రవారం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే, నేడు కోర్టుకు హాజరైన అల్లు అర్జున్ రూ.50 వేలు విలువైన రెండు పూచీకత్తుల పత్రాలను సమర్పించి, న్యాయమూర్తి ముందు హాజరయ్యారు. 

ఈ సమయంలో, బన్నీ తన కొత్త లుక్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. గత ఆరేళ్లుగా 'పుష్ప' సినిమా కోసం జుట్టు, గడ్డం పెంచిన అల్లు అర్జున్.. తాజాగా ఆ లుక్‌ను మార్చి సాధారణ హెయిర్‌స్టైల్‌లో కనిపించారు. కోర్టుకు వచ్చిన బన్నీని చాలా రోజుల తర్వాత  సింపుల్ లుక్ లో కనిపించడంతో.. బన్నీ న్యూ లుక్  కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Also Read : ఆరు సెంటర్లలో 100 రోజులు.. 'దేవర' సంచలన రికార్డ్

అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' గత ఏడాది డిసెంబర్‌లో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1799 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.

ఇక తదుపరి ప్రాజెక్ట్ విషయానికి వస్తే.. అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మరో సినిమా చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ కాంబినేషన్‌లో వచ్చిన 'జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాయి. దీంతో వీరి కాంబోలో రానున్న నాలుగో ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు