Allu Aravind: నేను అలా అనలేదు.. మెగా ఫ్యాన్స్‌కు అల్లు అరవింద్ క్షమాపణలు!

మెగా అభిమానులకు నిర్మాత అల్లు అరవింద్ క్షమాపణలు చెప్పాడు. 'తండేల్' మూవీ ఈవెంట్‌లో రామ్ చరణ్ స్థాయి తగ్గించి తాను మాట్లాడినట్లు వార్తలు రావడం బాధాకరమన్నాడు. 'చెర్రీ నాకు ఏకైక మేనల్లుడు. నేను ఏకైక మేనమామను. ఫ్యాన్స్ ఫీలైతే సారీ. ట్రోల్స్ ఆపండి' అని కోరాడు.

New Update
allu arv

Allu Aravind apologizes to mega fans

Allu Aravind: మెగా అభిమానుల(Mega Fans)కు నిర్మాత అల్లు అరవింద్ క్షమాపణలు చెప్పాడు. 'తండేల్' మూవీ ఈవెంట్‌(Thandel Movie Event)లో రామ్ చరణ్(Ram Charan) స్థాయి తగ్గించినట్లు తాను మాట్లాడినట్లు వార్తలు రావడం బాధకరమన్నారు. 'చరణ్ నాకు ఏకైక మేనల్లుడు. నేను ఏకైక మేనమామను. ఫ్యాన్స్ ఫీలైతే సారీ. ట్రోల్స్ ఆపండి' అన్నారు. 

Also Read:  కాంగ్రాట్స్ రాహుల్.. ఢిల్లీ ఫలితాలపై ట్విట్టర్లో కేటీఆర్ సెటైర్లు!

ఉద్దేశపూర్వకంగా అనలేదు..

ఈ మధ్య నేను, దిల్ రాజు సినిమా ఇండస్ట్రీ పరిస్థితి గురించి చెప్పేక్రమంలో ఉద్దేశపూర్వకంగా మాట్లాడినట్లు కొంతమంది ఫీల్ అయ్యారు. దిల్ రాజుని అడ్డంపెట్టుకుని రాంచరణ్ ని తగ్గించాను అని నన్ను ట్రోల్ చేశారు. ముఖ్యంగా మెగా అభిమానులు ఫీలై ట్రోల్ చేశారు. కానీ చరణ్ నాకు ఏకైక మేనల్లుడు. నేను చరణ్ కు ఏకైక మేనమామను. ఇక్కడితో ఆ విషయాన్ని వదిలేయండి. ఉద్దేశపూర్వకంగా నేను అనలేదు. ఎవరైనా ఫీలయితే సారీ. చరణ్ కి నాకు మధ్య ఓ మంచి అనుబంధం ఉంది. అంటూ అల్లు అరవింద్ చెప్పారు. 

Also Read:  US tech: అమెరికాలో ఉన్న ఇండియన్స్‌కు మరో బిగ్ షాక్.. ఊడుతున్న వేలాది ఉద్యోగాలు!

అల్లు అరవింద్ ఏమన్నారంటే.. 

తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ ను వేదికపై పొగిడేసిన అల్లు అరవింద్ సంక్రాంతి సినిమాలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. సంక్రాంతికి దిల్ రాజ్ నిర్మించిన సినిమాల్లో ఒకటి పడిపోగా మరొకటి ఎక్కడికి లేచిందన్నారు. అలాగే ఈ రెండు సినిమాల ద్వారా సంపాదించింది ఎంతో కానీ ఐటీ రైడ్స్ ఎదుర్కొన్నారంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో రామ్ చరణ్ 'గేేమ్ ఛేంజర్'ను ఉద్దేశించే ఈ మాటలు అన్నాడని మెగా ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. అల్లు ఫ్యామిలీపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. 

Also Read:   వంటలో నల్ల మిరియాలు వాడితే బరువు తగ్గుతారా?

Also Read:  ఢిల్లీ ఫలితాలపై కోమటిరెడ్డి రియాక్షన్.. కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hit 3 Song: ‘హిట్ 3’ నుంచి అర్జున్ సర్కార్ పవర్‌ఫుల్ సాంగ్.. అనిరుధ్ పాడిన పాట విన్నారా?

నాని ‘హిట్ 3’ మూవీ నుంచి మూడో సాంగ్ రిలీజ్ అయింది. ‘తన కోసమే నా పొగరే’.. అంటూ సాగే ఈ సాంగును మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌ ఆలపించాడు. మిక్కీ జే. మేయర్‌ స్వరాలు అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. 

New Update
HIT 3 new song

HIT 3 new song

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న కొత్త చిత్రం ‘హిట్ 3’. శైలేశ్‌ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ‘హిట్‌’ ఫ్రాంచైజీలో వస్తోన్న మూడో చిత్రం కావడంతో అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి పార్ట్‌లో విశ్వక్ సేన్, సెకండ్ పార్ట్‌లో అడివి శేష్ నటించి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. ఇప్పుడు మూడో పార్ట్‌లో నేచురల్ స్టార్ నాని నటిస్తుండటంతో అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. 

మూడో సాంగ్

ఈ సినిమాలో నాని.. అర్జున్ సర్కార్‌గా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడు. ఈ చిత్రం అన్ని పనులు పూర్తి చేసుకుని మే 1న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసిన మూవీ యూనిట్.. తాజాగా ఈ సినిమాలోని మూడో సాంగ్‌ను రిలీజ్ చేసింది. ‘తన కోసమే నా పొగరే’.. అంటూ సాగే ఈ సాంగును మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌ ఆలపించాడు. మిక్కీ జే. మేయర్‌ స్వరాలు అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. 

Hit 3 Song | actor-nani | Srinidhi Shetty HIT- 3 | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment