కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. రేసింగ్ ప్రాక్టీస్‌లో ఉన్నప్పుడు ఆయన రైడింగ్ కారు అనూహ్యంగా అదుపు తప్పి ట్రాక్ పక్కన ఉన్న గోడను ఢీకొట్టింది. ఈ ఘటన చూసిన సిబ్బంది ఒక్కసారిగా భయంతో ఆయన వద్దకు పరుగెత్తారు. Also Read : ఆస్కార్ బరిలో అట్టర్ ప్లాప్ సినిమా.. నెట్టింట ట్రోల్స్ అదృష్టవశాత్తూ, అజిత్ ఈ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అజిత్ రేసింగ్ కోసం దుబాయిలో శిక్షణ పొందుతున్నారు. శిక్షణ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రేసింగ్ అంటే అజిత్‌కు ఎంత ఇష్టమో తెలిసిన విషయమే. Ajith Kumar"s massive crash in practise, but he walks away unscathed.Another day in the office … that"s racing!#ajithkumarracing #ajithkumar pic.twitter.com/dH5rQb18z0 — Ajithkumar Racing (@Akracingoffl) January 7, 2025 నటనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అజిత్.. మరోవైపు తన హాబీ అయిన రేసింగ్‌ను కూడా ప్రోత్సహిస్తూ ప్రపంచ స్థాయిలో విజయాలను సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రేసింగ్ రంగంలో ఎన్నో విజయాలను సాధించిన ఆయన.. ఇప్పుడు ఇంటెర్నేషనల్ లెవెల్ లో సక్సెస్ అయ్యేందుకు కసరత్తులు చేస్తున్నారు. కాగా అజిత్ రేసింగ్ ప్రాక్టీస్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Also Read : 'అన్ స్టాపబుల్' లో తారక్ ప్రస్తావన.. స్పందించిన నాగవంశీ