Actress Mohini: 90' లో సంచలనం సృష్టించిన బాలయ్య 'ఆదిత్య 369'.. ఇప్పుడు మరో సారి ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తోంది. దాదాపు 36ఏళ్ళ తర్వాత ఈ చిత్రాన్ని మళ్ళీ థియేటర్స్ లో రీరిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 4న విడుదల కానుంది. ఈ క్రమంలో ఇందులో నటించిన నటీనటులను మరోసారి గుర్తుచేసుకుంటున్నారు ఫ్యాన్స్. అప్పుడు, ఇప్పుడు అంటూ హీరో హీరోయిన్ల ఫొటోలు వైరల్ చేస్తున్నారు. కాగా, ఇందులో బాలయ్య ప్రియురాలిగా నటించిన హీరోయిన్ మోహిని ఇప్పుడు గుర్తుపట్టనంతగా మారిపోయారు. అయితే ఇప్పుడు ఆమె ఎలా ఉంది.? ఏం చేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..
100కు పైగా సినిమాలు
నటి మోహిని అలియాస్ మహాలక్ష్మి శ్రీనివాసన్ తెలుగులో నటించిన తొలి సినిమా ఆదిత్య 369. అయినప్పటికీ ఆమె నటన, చలాకీ తనంతో తొలి పరిచయంలోనే సినిమాతోనే ఆడియన్స్ మనసులు కొల్లగొట్టింది. 90's డ్రీమ్ గర్ల్ గా అప్పట్లో సంచలనం సృష్టించింది. తెలుగులో డిటెక్టివ్ నారద, హిట్లర్ తో పాటు కోలీవుడ్ లో అనే సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. మొత్తం సౌత్ లో 100కు పైగా సినిమాల్లో నటించింది.
Also Read: అత్యంత దయనీయంగా శ్రీతేజ్ పరిస్థితి.. కనీసం కుటుంబసభ్యులను కూడా గుర్తుపట్టలేని దుస్థితి
/rtv/media/media_files/2025/04/03/2tamAoeVKK7sMCflCU17.jpg)
గుర్తుపట్టనంతగా..
కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకున్న మోహిని.. ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసి అమెరికాలో స్థిరపడింది. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు వ్యక్తిగత కారణాల చేత భర్తతో విడాకులు తీసుకుంది. ప్రస్తుతం మోహిని అమెరికాలో క్రైస్తవ బోధకురాలిగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. అప్పుడు సినిమాల్లో సన్నగా నాజూకుగా కనిపించిన మోహిని.. ఇప్పుడు కాస్త బరువు పెరిగి బొద్దుగా కనిపిస్తున్నారు. కానీ ఆమె అందం ఏమాత్రం తగ్గలేదని అంటున్నారు నెటిజన్లు.
telugu-news | latest-news | cinema-news | Aditya 369