Sriya Reddy:పవన్ కళ్యాణ్ అలాంటి వారే.. శ్రియా రెడ్డి షాకింగ్ కామెంట్స్

నటి శ్రియా రెడ్డి పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు. పవన్ కళ్యాణ్ చాలా తెలివైన, మర్యాద గల వ్యక్తి అని అన్నారు. ఎంతో హుందాగా ఉంటారని..ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు. శ్రియా రెడ్డి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో కలిసి 'ఓజీ' సినిమా చేస్తున్నారు.

New Update

నటి శ్రియా రెడ్డి తెలుగులో విడుదలైన తమిళ్ ఫిల్మ్ 'పొగరు'  సినిమాలో ఈశ్వరి క్యారెక్టర్ తో టాలీవుడ్  ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. ఆ తర్వాత  కొన్నేళ్లు పాటు తెలుగు సినిమాల్లో పెద్దగా  కనిపించని ఈ బ్యూటీ ..  గతేడాది 'సలార్‌' సినిమాతో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ప్రస్తుత శ్రియా పవన్ కళ్యాణ్  'ఓజీ' సినిమా చేస్తోంది.  

ఇది కూడా చూడండి: సుమ కనకాల కొడుకుతో సందీప్ రెడ్డి వంగా.. షూటింగ్ మొదలు!

Also Read :  గూగుల్‌లో పనిచేసేవారికి షాక్.. 10 శాతం ఉద్యోగులు ఔట్

అద్భుతమైన వ్యక్తి.. 

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రియా రెడ్డి పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావిస్తూ.. ఆయన ప్రశంసలు కురిపించింది. శ్రియా రెడ్డి మాట్లాడుతూ.. "పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఇప్పటికే  కొన్ని సన్నివేశాలు చేశాను.. ఆయన చాలా తెలివైన, మర్యాద గల వ్యక్తి. ఎంతో హుందాగా నడుచుకుంటారు. ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి. ఎదుటివారితో ఆయన ప్రవర్తన, మాట్లాడే విధానం చక్కగా ఉంటుంది" అని చెప్పారు. 

'సాహో' ఫేమ్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం 'ఓజీ' షూటింగ్ థాయ్‌లాండ్‌లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు  ఏపీ ఉపముఖ్యమంత్రిగా  బాధ్యతలు నిర్వహిస్తూనే.. మరోవైపు సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు పవన్. 2023 లో మొదలైన 'ఓజీ'  చిత్రీకరణ పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడంతో ఆలస్యం అవుతూ వస్తుంది. 

ఇది కూడా చూడండి:  ఫైనల్లీ.. క్లీంకార ఫొటో షేర్ చేసిన ఉపాసన.. తాత చేతుల్లో ఎంత ముద్దుగా ఉందో..!

Also Read :  ఆఫర్ అదిరిందిగా..! ఐఫోన్ ఇంత తక్కువ ధరలోనా..?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Jaat Collections: వీకెండ్ కలెక్షన్స్ లో దుమ్ము దులిపేసిన ‘జాట్’..

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందిన "జాట్" సినిమా వీకెండ్‌కు బాక్సాఫీస్ వద్ద జోష్ పెంచింది. ఇండియా వైడ్ రూ.40 కోట్లు, వరల్డ్‌వైడ్ రూ.49.3 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాతో మైత్రి మూవీ మేకర్స్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

New Update
Jaat Collections

Jaat Collections

Jaat Collections: సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందిన "జాట్" సినిమా వీకెండ్‌కు బాక్సాఫీస్ వద్ద జోష్ పెంచింది. ఇండియా వైడ్ రూ.40 కోట్లు, వరల్డ్‌వైడ్ రూ.49.3 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాతో మైత్రి మూవీ మేకర్స్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ తొలిసారి టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించిన చిత్రం "జాట్", మాస్ ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇచ్చేలా థియేటర్లలో సందడి చేస్తోంది. సన్నీ డియోల్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌కి గోపీచంద్ మాస్ టేకింగ్ మిక్స్ కావడంతో ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది.

రిలీజ్ రోజు ప్రపంచవ్యాప్తంగా కొద్దిగ నెమ్మదిగా వసూళ్లు మొదలైనా, వీకెండ్‌కి బాక్సాఫీస్ వద్ద సినిమా వేగంగా పరుగులు పెట్టింది. ముఖ్యంగా శని, ఆదివారాల్లో వసూళ్లు గణనీయంగా పెరిగాయి.

Also Read: నరరూప రాక్షసుడిని చూస్తారు.. మే 1న థియేటర్లలో కలుద్దాం: నాని

ప్రపంచవ్యాప్తంగా రూ. 49.3 కోట్ల నెట్

తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ చిత్రం ఇండియా వ్యాప్తంగా రూ. 40 కోట్ల మార్క్‌ను దాటి, ప్రపంచవ్యాప్తంగా రూ. 49.3 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సినిమాకి సాలిడ్ వీకెండ్ ఓపెనింగ్ వచ్చిందని చెప్పొచ్చు.

Also Read: బాలయ్య ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే న్యూస్..

ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా, రణదీప్ హూడా విలన్‌గా కనిపించారు. మరో విశేషం ఏమిటంటే – ఈ ప్రాజెక్ట్ ద్వారా మైత్రి మూవీ మేకర్స్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.  మొత్తానికి "జాట్" బాక్సాఫీస్ వద్ద మెల్లగా మొదలై, వారం చివరికి భారీ వసూళ్లతో హిట్ మూవీగా నిలిచింది.

Also Read: ‘కేజీఎఫ్‌ చాప్టర్‌-2’: రాఖీ భాయ్ విధ్వంసానికి మూడేళ్లు!

Advertisment
Advertisment
Advertisment