/rtv/media/media_files/2025/03/31/YHkuhN0BILZUzCSoE89J.jpg)
actress abhinaya shared her engagement photos
Actress Abhinaya: నటి అభినయ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తాజాగా తన కాబోయే భర్తను పరిచయం చేస్తూ ఫొటోలను షేర్ చేసింది. మార్చి 9న తన చిరకాల స్నేహితుడు కార్తిక్ ని నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలిపింది. అలాగే ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫొటోలను ఇన్ స్టా వేదికగా పంచుకుంది. కార్తిక్ భీమవరానికి చెందిన ఓ వ్యాపార వేత్త. అతడికి అనేక వ్యాపారాలు ఉన్నాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ఇద్దరి జోడీ సూపర్ గా ఉంది అంటూ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అభినయ- కార్తీక్ వివాహం భీమవరం లేదా చెన్నైలో జరగనున్నట్లు తెలుస్తోంది.
విశాల్ తో రూమర్లకు చెక్..
ఈ పోస్టుతో హీరో విశాల్ తో అభినయ రిలేషన్ షిప్ అంటూ వస్తున్న రూమర్లకు చెక్ పడింది. గతేడాది విశాల్ తో అభినయ ప్రేమలో ఉన్నట్టు, ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని చాలా రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. ఇప్పుడు అభినయ తన కాబోయే భర్తను పరిచయం చేయడంతో ఇవన్నీ పుకార్లేనని తేలిపోయింది.
Also Read: Janhvi Kapoor: సూట్ విప్పి.. ర్యాంప్ పై అదరగొట్టిన జాన్వీ.. నడుస్తుంటే మామూలుగా లేదుగా! వీడియో వైరల్
ఇక అభినయ సినిమా విషయానికి వస్తే.. తెలుగు చిత్రాలలో సిస్టర్ రోల్స్, సహాయక పాత్రలకు బాగా పాపులర్. అభినయ తెలుగులో నేనింతే, డమరుకం, శంభో శివ శంభో, ధ్రువ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సీతారామం వంటి సూపర్ హిట్ సినిమాల్లో సహాయక పాత్రల్లో అలరించారు. చిన్నప్పటి నుంచి వినికిడి, మాటలురాని అభినయ ఆత్మవిశ్వాసం, నైపుణ్యంతో నటిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే ఆమె ఫీమేల్ లీడ్ గా నటించిన 'పాణి' అనే చిత్రానికి సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది.
cinema-news | telugu-news | latest-news
Also Read: Actress Abhinaya: హీరో కాదు బిజినెస్ మ్యాన్.. కాబోయే భర్తను పరిచయం చేసిన అభినయ!