/rtv/media/media_files/2025/01/30/R07fy9rp6xVCh1lRjYXw.jpg)
vishal and abhinaya
సాధారణంగా సినీ పరిశ్రమలోని సెలబ్రిటీలపై గాసిప్స్ హల్‌చల్ చేయడం సహజమే. అభినయ కూడా అందుకు మినహాయింపు కాదు. హీరో విశాల్‌తో అభినయ డేటింగ్ చేస్తున్నారని.. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి పూజ, మార్క్ ఆంటోనీ సినిమాల్లో కలిసి నటించారు. అయితే విశాల్ తో డేటింగ్ వార్తలపై అభినయ స్పందించారు. ఇవన్ని వట్టి రూమర్స్ అని కొట్టిపారేసింది.
తనకు ఇప్పటికే ప్రేమికుడు ఉన్నాడని, తనపై దయచేసి ప్రేమ గాసిప్‌లు ప్రచారం చేయవద్దని అభినయ కోరింది. గత 15 సంవత్సరాలుగా తాను ప్రేమలో ఉన్నానని.. అతను తన చిన్ననాటి స్నేహితుడిని చెప్పుకొచ్చింది. మాకు తెలియకుండానే మేమిద్దరం ప్రేమించుకోవడం మొదలుపెట్టామని... దయచేసి తనను ఏ నటుడితోనూ లవ్ ఉందంటూ రూమర్స్ రాయొద్దని చెప్పింది. అయితే అతను ఎవరు? పేరేంటనే వివరాలను మాత్రం అభినయ బయటపెట్టలేదు. మొత్తానికి ఈ గాసిప్ తో అభినయ అసలు విషయం బయటపెట్టింది. త్వరలో అభినయ పెళ్లి పీటలు ఎక్కనుందని ఆమె అభిమానులు సంతోష పడుతున్నారు.
చిన్నప్పటి నుంచి మూగ, చెవిటి
చిన్నప్పటి నుంచి మూగ, చెవిటి అయిన అభినయ తనపై ఉన్న నమ్మకం వల్లే నేడు నటిగా రాణిస్తోంది. ఆమె విజయానికి ప్రధాన కారణం ఆమె తల్లిదండ్రుల మద్దతు అని చెప్పవచ్చు. 2008లో 'నేనింతే' అనే తెలుగు సినిమాతో అభినయ తొలిసారిగా నటించింది. తెలుగు సినిమాల్లో నటించిన ఆమె 2009లో సముద్రఖని దర్శకత్వం వహించిన 'నాడోడిగులు'తో తమిళంలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రానికి ఆమె ఉత్తమ తొలి నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు, ఉత్తమ సహాయ నటిగా విజయ్ అవార్డుతో సహా అనేక అవార్డులను గెలుచుకుంది. ఈ సినిమా విజయంతో అభినయకు వరుస సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఒరువన్, ఈషాన్, జీనియస్, వీరమ్, పూజై, మార్క్ ఆంటోని వంటి పలు చిత్రాల్లో అభినయ నటించారు. . తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో మహేష్, వెంకటేష్ కి చెల్లి గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
గత ఏడాది అక్టోబర్ 24న విడుదలైన అభినయ యాక్షన్ చిత్రం 'పాణి'కి అద్భుతమైన స్పందన లభించింది. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందాయి. ఇటీవలే సోనీ లైవ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.
Also Read : ఎస్సీ బాలికల హాస్టల్లో ఊడిపడ్డ ఇనుప పైపు..తర్వాత ఏమైందంటే...