Viral Video: సినీ హీరోలు తమ సినిమాల్లో చేసే స్టంట్‌ల గురించి ఎంత చెప్పినా తక్కువే, ఒకేసారి వివిధ గెటప్‌లు ధరించి రోడ్లపై తిరుగుతూ ప్రజలను ఆశ్చర్యపరిచిన సందర్భాలు చాలా ఉన్నవి. తాజాగా బాలీవుడ్ "మిస్టర్ పర్ఫెక్ట్" అమీర్ ఖాన్ కూడా అలాంటి జాబితాలో చేరిపోయారు. ప్రస్తుతం ఈయన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు. ఇందుకు కారణం ఆయన అనూహ్య వేషధారణ.
Also Read: చనిపోయిన పేరెంట్స్ కు కుంభమేళాలో స్నానం.. ఆ కూతురు ఏం చేసిందంటే!-VIDEO VIRAL
అమీర్ ఖాన్ ఒక అడవి మనిషి వేషంలో ముంబై వీధుల్లో తిరిగి, రోడ్లపై డాన్స్ చేస్తూ పబ్లిక్‌ను ఆశ్చర్యపరిచారు. ఆయనను చూసి కొంతమంది భయపడి పారిపోయారు. మరి కొంత మంది అయినను గుర్తుపట్టి వీడియోలను ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, అసలు విషయం వెలుగు చూసింది.
అయితే, ఐప్పుడు ఈ వార్త చర్చనీయాంశం అయ్యింది, స్టార్ హీరో అయిన అమీర్ ఖాన్ ఇలా ఏదో పిచ్చి వేషంలో రోడ్లపై తిరగడం తగదు అని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఇమ్వానికి ఇంటి భోజనం తినిపించిన యంగ్ రెబల్ స్టార్!
ఈ రోడ్లపై బిచ్చగాడిలా అమీర్ ఖాన్..
అసలు ఈ రోడ్లపై బిచ్చగాడిలా తిరిగే వేషం వెనుక ఉద్దేశం ఏంటంటే.. అమీర్ ఖాన్ ప్రస్తుతం చాలా బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నాడు. కోకోకోలా ఇండియా "ఛార్జ్డ్" డ్రింక్ ను ప్రమోట్ చేయడానికి ఆ కంపెనీ వాళ్ళు అమీర్ ఖాన్‌ను సెలెక్ట్ చేసుకున్నారు.
To Ye Caveman Amir Khan Tha BC 😲😲
— POSITIVE FAN (@imashishsrrk) January 29, 2025
But Why ? pic.twitter.com/fRgDB6cEhr
Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు.. ఆ 18 మంది జడ్జిల బ్లాక్ మెయిల్?
ఈ యాడ్‌లో, అమీర్ ఖాన్ డ్రింక్ తాగి డాన్స్ చేస్తూ విచిత్రమైన వేషధారణలో కనిపిస్తున్నాడు. అయితే, దీనిపై కొంతమంది విమర్శలు చేస్తున్నారు. "ఇదేమి సినిమా కూడా కాదు, ఒక యాడ్ కోసం ఇలా చేయడం కరెక్ట్ కాదు!" అంటూ నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు, ఏదేమైనప్పటికీ ఆ బ్రాండీకి మాత్రం మంచి ప్రమోషన్ లభించిందనే చెప్పాలి. ఇప్పడు సోషల్ మీడియా లో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.