This Week Movies : ఈ వారం సినిమాల సందడి..!

ఈ వారం ఓటీటీ, థియేటర్ ప్రేక్షకులను అలరించడానికి పలు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. రౌడీ బాయ్స్ హీరో ఆశిష్, వైష్ణవి చైతన్య 'లవ్ మీ', జబర్దస్త్ గెటప్ శ్రీను 'రాజ్ యాదవ్', డర్టీ ఫెలో, హాలీవుడ్ ఫిల్మ్ ‘ఫ్యూరియోసా.

New Update
This Week Movies : ఈ వారం సినిమాల సందడి..!

Theatre - OTT Releases : ఈ వారం థియేటర్, ఓటీటీ (OTT) ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి రాబోతున్న రాబోతున్న చిత్రాలు.

లవ్ మీ

రౌడీ బాయ్స్ హీరో ఆశిష్, బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) జంటగా నటించిన ప్రేమకథా చిత్రం 'లవ్ మీ'. బేబీ మూవీతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిపోయిన వైష్ణవి మరో సారి లవ్ మీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అరుణ్ భీమవరపు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని దిల్‌రాజు ప్రొడక్షన్ బ్యానర్ పై హర్షిత్‌ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి సంయుక్తంగా నిర్మించారు. 'లవ్ మీ' మే 25న థియేటర్స్ లో విడుదల కానుంది.

డర్టీ ఫెలో

ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో శాంతి చంద్ర, దీపిక సింగ్, సిమ్రితి ప్రధాన పాత్రలో నటించిన మూవీ 'డర్టీ ఫెలో' (Dirty Fellow). కమర్షియల్ ఎలిమెంట్స్, యాక్షన్ తో కూడిన ఈ చిత్రాన్ని జి.ఎస్‌.బాబు నిర్మించారు. సత్యప్రకాశ్, నాగినీడు, జయశ్రీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం మే 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రాజు యాదవ్

జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను (Getup Srinu), అంకిత క్యారట్ కారాట్‌ జంటగా నటించిన చిత్రం రాజు యాదవ్. ఈ సినిమాతో కమెడియన్ గెటప్ శ్రీను హీరోగా పరిచయమవుతున్నారు. కామెడీ, డ్రామా, సస్పెన్స్, ఎమోషన్ అన్ని భావోద్వేగాలతో కూడిన ఈ చిత్రాన్ని కె . కృష్ణమాచారి తెరకెక్కించారు. ట్రైలర్, టీజర్ తో ఆకట్టుకున్న 'రాజ్ యాదవ్' మే 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఫ్యూరియోసా

యాక్షన్‌, అడ్వెంచర్‌ ఫిల్మ్ ‘ఫ్యూరియోసా మే 23న ఇంగ్లిష్‌తో పాటు, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. నటులు అన్య టేలర్‌, క్రిస్‌ హేమ్స్‌వర్త్‌ కీలక పాత్రల్లో నటించారు.

ఓటీటీ చిత్రాలు

  • డిస్నీ+హాట్‌స్టార్‌ : ద బీచ్‌ బాయ్స్‌ ( డాక్యుమెంటరీ మూవీ) మే 24 నుంచి స్ట్రీమింగ్
  • జియో సినిమా: ఆక్వామెన్‌-2 (తెలుగు) మే 21న
  • జీ 5: వీర్‌ సావర్కర్‌ (హిందీ) మే 24నుంచి
  • అమెజాన్ ప్రైమ్: ద టెస్ట్‌ 3 (వెబ్‌సిరీస్‌) మే 23 నుంచి స్ట్రీమింగ్
  • నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) : టఫెస్ట్‌ ఫోర్సెస్‌ ఆన్‌ ది ఎర్త్‌ (డాక్యుమెంటరీ సిరీస్‌)మే 22 నుంచి స్ట్రీమింగ్

JR NTR : ఎన్టీఆర్‌కు హృతిక్‌ స్పెషల్‌ ట్వీట్.. వార్‌-2పై అదిరే అప్‌డేట్ - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Priyanka Jain: అబ్బా! బ్లూ శారీలో ప్రియాంక భలే ఉందిగా.. ఫొటోలు చూశారా

బిగ్ బాస్ బ్యూటీ, బుల్లితెర నటి ప్రియాంక జైన్ నీలిరంగు చీరలో ఆకట్టుకుంటోంది. స్టన్నింగ్ ఫోజులతో నెటిజన్లను ఫిదా చేస్తోంది. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి. Short News | Latest News In Telugu | సినిమా

New Update
Advertisment
Advertisment
Advertisment