Cholera : ఆ దేశం వెన్నులో వణుకు...100 దాటిన మరణాలు...!!

New Update
Cholera : ఆ దేశం వెన్నులో వణుకు...100 దాటిన మరణాలు...!!

దశాబ్దాల క్రితం ప్రపంచవ్యాప్తంగా విధ్వంసం సృష్టించిన కలరా వ్యాధి మళ్లీ వచ్చింది. ఈ పేరు వింటేను జింబాబ్వే వెన్నులో వణుకు పుడుతోంది. అపరిశుభ్రత, ఇతర కారణాల వల్ల ఒక్కప్పుడు భారత్ ను గడగడలాడించిన ఈ మహమ్మారి ప్రస్తుతం జింబాబ్వేను వణికిస్తోంది. ప్రస్తుతం ఆ దేశం అంతటా కలరా వ్యాప్తి చెందుతోంది. ఈ వ్యాధిన బారి సుమారు వందకు పైగా మరణించినట్లు ఆదేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. జింబాబ్వేలో కలరా విధ్వంసం మరోసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సహా మొత్తం ప్రపంచాన్ని భయపెట్టింది. నివేదికల ప్రకారం, జింబాబ్వేలో గత నెల చివరి నుండి 100 మంది అనుమానిత కలరా రోగులు మరణించారు. 5000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి.

జింబాబ్వేలో ఈ వ్యాధి వ్యాపించడంతో... అంత్యక్రియలు చేసే వ్యక్తుల సంఖ్యను పరిమితం చేసింది అక్కడి ప్రభుత్వం. ప్రభావిత ప్రాంతాల్లో కార్యక్రమాలను నిషేధించడంతో సహా దీనిని నివారించడానికి ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించింది. ఈ మేరకు ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం మరణాల సంఖ్యను ప్రకటించింది. ప్రయోగశాల పరీక్షల ఆధారంగా 30 మంది రోగులు కలరాతో మరణించినట్లు నిర్ధారించారు. 905 కలరా కేసులు నిర్ధారించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. 4609 ఈ వ్యాధి అనుమానిత కేసులు నమోదు అయినట్లు వెల్లడించింది.

ఇది కూడా చదవండి: పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..

కలరా అనేది నీటి ద్వారా సంక్రమించే వ్యాధి. ఇది అపరిశుభ్రమైన ప్రదేశాలలో వ్యాపిస్తుంది. కలుషిత నీరు లేదా ఆహారం తీసుకోవడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. జింబాబ్వేలో స్వచ్ఛమైన తాగునీటి సమస్య ఉంది. మణికలాండ్, మాస్వింగో ప్రావిన్సులలో అత్యంత ప్రభావితమైన ప్రాంతాల్లో అంత్యక్రియలకు హాజరయ్యే వ్యక్తుల సంఖ్య 50కి పరిమితం చేసింది. ప్రజలు ఒకరికొకరు కరచాలనం చేయకూడదని, అంత్యక్రియలకు ఆహారం అందించకూడదని ప్రభుత్వం పేర్కొంది. ప్రజలు బహిరంగ మార్కెట్‌లకు వెళ్లవద్దని, సామాజిక కార్యక్రమాలకు కూడా వెళ్లవద్దని ప్రభుత్వం తెలిపింది. మళ్లీ విజృంభిస్తున్న కలరా ప్రపంచంలోని ఇతర దేశాలను కూడా భయాందోళనలకు గురిచేసింది.

ఇది కూడా చదవండి: ఇంగ్లండ్‌ బౌలర్లను చీల్చిచెండాడిన కివీస్‌ బ్యాటర్లు.. ఫస్ట్ విక్టరీ న్యూజిలాండ్‌దే!

కాగా జింబాబ్వేలో 2008, 2009 సంవత్సరంలో కలరా వ్యాప్తి కారణంగా దాదాపు 4వేలకు పైగా మంది మరణించారు. అలాగే 2018-2019లోనూ ఈ దేశ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. డబ్ల్యూహెచ్ఓ నివేదిక తెలిపిన వివరాల ప్రకారం పదివేలకు మించిన అనుమానిత కేసులను గుర్తించినట్లు తెలిపింది. ఇక్కడి ప్రజలు ఎక్కువగా బావి నీటి వాడకం, చెరువులు, కుంటల్లో నీటిని ఇంటి అవసరాలకు వాడటమే కలరా వ్యాప్తికి కారణమవుతుందని పేర్కొంది. ప్రజల అవసరాల మేరకు బోరు పంపులు వేయడం వంటి కార్యక్రమాలను అక్కడి ప్రభుత్వం చేపట్టింది. అయినా కూడా మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు తాగునీటికోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం విస్తరిస్తున్న కలరాను నిరోధించేందుకు ప్రభుత్వంతోపాటు సామాజిక సేవా సంఘాలు శ్రమిస్తున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు