పకోడీగాళ్ల సలహాలు మాకొద్దు.. చిరు వ్యాఖ్యలపై వైసీపీ కౌంటర్‌

ఓ ప్రైవేట్ పార్టీలో చిరంజీవి ఏపీ ప్ర‌భుత్వంపై చేసిన వ్యాఖ్య‌లు దుమారంగా మారింది. ఎప్పుడూ ఏపీ ప్ర‌భుత్వాన్ని కానీ, సీఎం జ‌గ‌న్‌ని కానీ విమ‌ర్శించ‌ని చిరు ఈ సారి నేరుగా ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డంతో ఏపీ పెద్దలు వరసగా కౌంటర్‌ ఇస్తున్నారు. జ‌న‌సేన‌ని స‌పోర్ట్ చేస్తూ చిరంజీవి ఈ సంద‌ర్భంగా ఏపీ ప్ర‌భుత్వ ప‌నితీరుపై వ్యాఖ్య‌లు చేశారాని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

New Update
పకోడీగాళ్ల సలహాలు మాకొద్దు.. చిరు వ్యాఖ్యలపై వైసీపీ కౌంటర్‌

ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే అభివృద్ధి చేయకుండా ఇండస్ట్రీపై ఎందుకు పడతారని ఏపీ ప్రభుత్వాన్ని చిరు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, ఉద్యోగాలు, పేదల కోసం ఆలోచిస్తే తలవంచి నమస్కరిస్తా అంటూ చిరంజీవి వ్యాఖ్యలకు వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా సినిమాపై పడతారెందుకు అంటూ వాల్తేరు వీరయ్య 200 డేస్ ఫంక్షన్‌లో చిరు వ్యాఖ్యలు ఏపీలో హాట్‌ టాఫిక్‌గా మారింది.

సినీ ఇండ‌స్ట్రీకి చెందిన వారు వైసీపీ ప్ర‌భుత్వంపై ఎలాంటి వ్యాఖ్య‌లు చేసినా ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియా ముందుకు రావ‌డం, విమ‌ర్శ‌లు గుప్పించ‌డంలో తగ్గేదేలే అంటారు. చిరు వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ఏపీ నేత‌లు పవన్‌ కళ్యాన్‌ ఉద్దేశించి చిరుపై వైసీపీ నేత‌లు విమ‌ర్శ‌నాస్త్రాలకు సంధించారు..మరి ఈ విషయంలో సీఎం జ‌గ‌న్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

ఏపీలో వైసీపీ ప్రభుత్వ విధానాలపై మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతోంది. ఇంకా చెప్పాలంటే చిరంజీవి చేసిన వ్యాఖ్యలు అధికార వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. చిరంజీవి వ్యాఖ్యలపై వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని మండిపడుతూ.. సినీ ఇండస్ట్రీలో చాలా మంది పకోడీ గాళ్లున్నారని, ప్రభుత్వం ఎలా ఉండాలో వారు సలహా ఇస్తున్నారంటూ కొడాలి ఫైర్ అయ్యారు. అలాగే పకోడీ గాళ్లు సలహాలు తనవాళ్లకు ఇచ్చుకోవచ్చు కదా అంటూ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి కొడాలి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీళ్లు తమ వారికి రాజకీయాలు ఎందుకు, డాన్స్, ఫైట్స్ యాక్షన్ మనం చూసుకుందాం అని చెప్పొచ్చు కదా అంటూ చిరంజీవిని, సోదరుడు పవన్‌ను ఉద్దేశించి కొడాలి వ్యాఖ్యానించారు. దీంతో కొడాలి కౌంటర్ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. కొడాలి వ్యాఖ్యల్ని వైసీపీ నేతలు సమర్ధిస్తుండగా.. పవన్ కళ్యాణ్‌ అభిమానులు తప్పు బడుతున్నారు. ఈ విషయం ఇంకా ఎంత దూరం పోతుందో చూడాలి.

మాకు కాదు మీ తమ్ముడికి చెప్పండి

ఇక చిరు వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కూడా కౌంటర్ ఇచ్చారు. చిరంజీవి ఎందుకు వ్యాఖ్యలు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సినీ పరిశ్రమ పిచ్చుక అని ఒప్పుకుంటారా? అని మంత్రి అన్నారు. ఏపీలో పథకాలు అందరికీ అందుతున్నాయని, ప్రతి సమస్యపై ప్రభుత్వం స్పందిస్తుందన్నారు. చిరంజీవి వ్యాఖ్యలపై ఎంపీ నందిగం సురేష్ కూడా ట్వీట్‌ చేశారు. మొదలు పెట్టింది మీ తమ్ముడే.. రాజకీయాలు చేయొద్దని మీ తమ్ముడికి చెప్పండి చిరంజీవి అంటూ ఎంపీ నందిగం సురేష్‌ ట్వీట్‌తో బదులిచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు