China: ఏఐకు ధీటుగా చైనా ఓపెన్‌ ఏఐ జనరేటెడ్‌ ఫీచర్‌.. వీడియో చూస్తే మైమరిచిపోతారు!

ఏఐకు ధీటుగా చైనా ఓపెన్‌ ఏఐ జనరేటెడ్‌ వీడియోలను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. చైనీస్ కంపెనీ కుయిషౌ టెక్నాలజీ, క్లింగ్ పేరుతో ఓ మోడల్‌ను ఆవిష్కరించగా దీనికి 'సోరా' అని పేరు పెట్టింది. టీజర్ రూపంలో విడుదలచేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

New Update
China: ఏఐకు ధీటుగా చైనా ఓపెన్‌ ఏఐ జనరేటెడ్‌ ఫీచర్‌.. వీడియో చూస్తే మైమరిచిపోతారు!

Model Cling: చైనా మరో కొత్త క్రియేటివిటీకి నాంది పలికింది. ఏఐకు ధీటుగా చైనా ఓపెన్‌ ఏఐ జనరేటెడ్‌ వీడియోలను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. నిజానికి 2024 ఫిబ్రవరిలో ఓపెన్‌ ఏఐ హై-డెఫినిషన్ వీడియోలను సృష్టించే ఒక ఫీచర్‌ను రిలీజ్ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. మనం టెక్ట్స్‌ ఇస్తే ఓపెన్‌ ఏఐ దానికి అంతట అదే వీడియోలను క్రియేట్ చేస్తుంది. దీనికి సోరా అని పేరు పెట్టింది. అయితే ఇప్పటివరకు సోరా వినియోగదారులకు అందుబాటులోకి రాలేదు. కానీ చైనా అమెరికాకు షాక్‌ ఇచ్చేలా ఓ వీడియో జనరేటడ్‌ మోడల్‌ వీడియోను టీజర్‌గా రిలీజ్ చేసింది. చైనీస్ కంపెనీ కుయిషౌ టెక్నాలజీ క్లింగ్ పేరుతో ఓ మోడల్‌ను ఆవిష్కరించింది.

ఈ క్లింగ్‌ వీడియోలలో అన్నిటికంటే బెస్ట్‌గా కనిపిస్తున్న అంశం ఫొటో రియలిజం. క్లిప్స్‌లో ఎక్కడా బ్లర్‌ ఉన్నట్టు అనిపించదు. ఇతర ఏఐ వీడియోల్లో కనిపించే బ్లర్‌ స్థాయి ఈ వీడియోల్లో ఉండవు. ఇక క్లింగ్‌కు కచ్చితమైన మోషన్‌ కనిపిస్తోంది. రియాలిటీకి దగ్గరగా వస్తువువు కదులుతున్నట్టుగానే ఉంటుంది. ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించగల సామర్థ్యం క్లింగ్‌కు ఉందంటున్నారు టెక్‌ ఎక్స్‌పర్ట్స్‌. క్లింగ్‌తో 1080p క్వాలిటీతో రెండు నిమిషాల వరకు వీడియోను రూపొందించవచ్చని కంపెనీ చెబుతోంది. ఇది నిజానికి సోరా లాగానే డిఫ్యూజన్ ట్రాన్స్‌ఫార్మర్ మోడల్. అటు సోరా, క్లింగ్‌ను సోషల్‌మీడియా యూజర్లు ఒకదానితో మరొకటి పోల్చుతున్నారు. ఈ రెండిటిలో క్లింగ్‌ వీడియోలే హై క్వాలిటీతో, వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు