China: చరిత్ర సృష్టించిన చైనా.. చంద్రుని ఆవలివైపు మట్టితో తొలిసారిగా భూమిపైకి

ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా చంద్రుని ఆవలివైపు నుంచి మట్టి నమూనాలను సేకరించి.. వాటిని విజయవంతంగా భూమి పైకి తీసుకొచ్చిన మొదటి దేశంగా చైనా చరిత్ర సృష్టించింది. చాంగే-6 వ్యోమనౌక మే 3న భూమి నుంచి బయలుదేరి.. చివరికి జూన్ 25 మట్టి నమూనాలతో భూమిపైకి విజయవంతంగా చేరుకుంది.

New Update
China: చరిత్ర సృష్టించిన చైనా.. చంద్రుని ఆవలివైపు మట్టితో తొలిసారిగా భూమిపైకి

జాబిల్లి యాత్రలో చైనా మరో రికార్డు సృష్టించింది. ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా చంద్రుని ఆవలివైపు నుంచి మట్టి నమూనాలను సేకరించి.. వాటిని విజయవంతంగా భూమి పైకి తీసుకొచ్చిన మొదటి దేశంగా చరిత్ర సృష్టించింది. చాంగే-6 వ్యోమనౌక మే 3న భూమి నుంచి బయలుదేరింది. జూన్‌ 2న చంద్రడి దక్షిణ ధృవంలోని అయిట్కిన్ బేసిన్‌లో దిగింది. ఇప్పటివరకు ఏ దేశం కూడా దక్షిణ ధృవాన్ని అన్వేషించలేదు. అక్కడ మట్టి నమూనాలను సేకరించిన చాంగే-6 వ్యోమనౌక.. మంగళవారం తిరిగి భూమిపైకి చేరుకుంది. ఈ యాత్రను విజయవంతంగా నిర్వహించిన శాస్త్రవేత్తలను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అభినందించారు.

Also Read: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి, వెడ్డింగ్ డ్రెస్ ధరెంతో తెలుసా!

స్థానిక కాలమాన ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2.07 గంటలకు చాంగే -6లోని రిటర్నర్ క్యాప్సూల్స్‌.. ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియన్ ప్రాంతంలో పారాచూట్ల సాయంతో సురక్షితంగా కిందకి దిగింది. ఇందులో దాదాపు 2 కిలోల వరకు జాబిల్లి నమునాలు ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ క్యాప్సూల్స్‌ను వాయుమార్గంలో బీజింగ్‌కు తరలించి.. అక్కడ దీన్ని తెరుస్తారు. ఆ తర్వాత శాస్త్రవేత్తల బృందానికి అప్పగిస్తారు. ఈ మట్టి నమూనాలతో చంద్రుడి పుట్టుక గురించి మరిన్ని కొత్త వివరాలు బయటపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Also Read: ఒక్కసారిగా 21 వేల అడుగుల కిందికి విమానం.. ప్రయాణీకులకు తీవ్ర గాయాలు 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Palestine: హమాస్ కుక్కల్లారా అంటూ పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్ మండిపాటు

మొట్టమొదటిసారి పాలస్తీనా ప్రభుత్వం హమాస్ కు వ్యతిరేకంగా మాట్లాడింది. హమాస్ కుక్కల్లారా బందీలను విడిచిపెట్టండి అంటూ పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ ఏకంగా తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. 

New Update
palestine

Mohammad Abbas

దాదాపు రెండేళ్ళుగా ఇజ్రాయెల్ , హమాస్ ల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. తమ దగ్గర బందీలను విడిచి పెట్టకుండా హమాస్ మొండి పట్టుదల పట్టుకుని కూర్చొంది. బందీలను విడిపించేందుకు ఇజ్రాయెల్ నరమేధం సృష్టిస్తోంది. పాలస్తీనాపై ముఖ్యంగా గాజాపై దాడులు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో గాజా సర్వనాశనం అయిపోయింది. అక్కడి ప్రజల బతుకు దుర్భరంగా మారింది. అయినా కూడా ఇజ్రాయెల్, హమాస్ రెండూ యుద్ధాన్ని మానడం లేదు. హమాస్ లో అగ్రనేతలందరూ దాదాపు మరణించారు. అయినా కూడా పట్టు విడవటం లేదు. 

కుక్కల్లారా అంటూ.. 

ఈ క్రమంలో మొట్టమొదటిసారిగా హమాస్ పై పాలస్తీనా స్పందించింది. పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ హమాస్ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఆయుధాలను, ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టాలని ఆదేశాలు చేశారు. హమాస్ కుక్కల్లారా...బందీలను వెంటనే విడిచిపెట్టండి అంటూ  అబ్బాస్ తిట్టిపోశారు. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న నరమేధం వెంటనే ఆగాలి. బందీల కోసం ఆ దేశపు సైన్యం నరకం సృష్టిస్తోంది. వారికి ఆ అవకాశం ఇవ్వోద్దు అంటూ హుకుం జారీ చేశారు. హమాస్ పై పాలస్తీనా నుంచి ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం కావడం ఇదే మొదటిసారి.

పాలస్తీనా అధ్యక్షుడు ఇంతలా విరుచుకుపడడానికి కారణం..రీసెంట్ గా హమాస్ చిన్న పిల్లలను , యువతను నియమించుకోవడమే. ఇప్పటికే తీవ్రంగా దెబ్బ తిన్న హమాస్..30 వేల మంది యువతను 'ఇజ్‌ అద్‌ దిన్‌ అల్‌ ఖస్సం బ్రిగేడ్‌'లో చేర్చుకున్నట్లు తెలుస్తోంది. వీళ్ళందరినీ యుద్ధంకోసం తయారు చేస్తోంది హమాస్. ఈ ఏడాది జనవరిలో కాల్పుల విరమణ ఒప్పందం రద్దయిన తర్వాతే వీళ్లు గ్రూప్‌లోకి వచ్చి ఉండొచ్చని అంటున్నారు. మరోవైపు  ప్రస్తుతం హమాస్‌ ఆయుధాలు, డోన్లు, క్షిపణుల కొరత ఎక్కువగా ఉంది. నిధులు కూడా లేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సంస్థలో ఉంటున్న సభ్యులకు కూడా చెల్లింపులు చేయలేని పరిస్థితి వచ్చింది. గాజాలోకి వెళ్లే మానవీయ సాయంలో ఇజ్రాయెల్ భారీగా కోత విధించింది. దీంతో హమాస్‌కు వాటిని దోచుకుని విక్రయించే ఛాన్స్ కూడా లేదని అల్ అరేబియా ఛానెల్ తెలిపింది.  

 today-latest-news-in-telugu | hamas | israel | palestine | gaza

Also Read: pahalgam terrorist attack: హిమాచల్ ప్రదేశ్ లో హై అలెర్ట్..ఉగ్రదాడి జరగొచ్చనే హెచ్చరికలు

 

 

Advertisment
Advertisment
Advertisment