Poonch Attack: పూంచ్ దాడుల వెనుక చైనా? షాకింగ్ విషయాలు చెప్పిన డిఫెన్స్! జమ్మూకశ్మీర్ -పూంచ్ జిల్లాలో ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు సైనికులు అమరులైన విషయం తెలిసిందే. ఈ దాడి వెనుక చైనా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లడఖ్ నుంచి ఆర్మీ దృష్టిని డైవర్ట్ చేసేందుకు పూంచ్ రీజియన్ వైపు పాకిస్థాన్‌ను చైనా ఎగదోస్తుందని తెలుస్తోంది. By Trinath 22 Dec 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి చైనా-పాకిస్థాన్ దొంగ నాటకాలు ఆడుతున్నట్టుగా తెలుస్తోంది. వీరిలో ఒకరితోనే డేంజర్ అనుకుంటే.. ఈ ఇద్దరి స్నేహితులు కలిసి పెద్ద కుట్ర చేస్తున్నట్టు సమాచారం. పూంచ్ ఉగ్రదాడుల్లో ఐదుగురు ఆర్మీ జవాన్లు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ దాడుల వెనుక చైనా కూడా ఉందన్న చర్చ జరుగుతోంది. ఇస్లామాబాద్-బీజింగ్‌ల సమన్వయ వ్యూహంలో భాగమే ఈ హింసా జరిగిందని డిఫెన్స్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. భద్రతా బలగాలపై దాడులు చేయడం, రెచ్చగొట్టడమే లక్ష్యంగా పాకిస్తాన్ 25-30 మంది ఉగ్రవాదులను పూంచ్ అటవీ ప్రాంతాల్లోకి చొరబడేలా చేసిందని సమాచారం. చైనా హస్తం ఉందా? ఇటీవలి కాలంలో సరిహద్దుల్లో చైనా హద్దుమీరుతోంది. పదేపదే భారత్ దళాలను కవ్విస్తోంది. ఈ భూమండలం మొత్తం తనదేనని భావించే చైనాకు ఇండియాలోని భూభాగాలు కూడా తమవిగానే కనిపిస్తాయి. సముద్రాలు కూడా వారివే అంటాయి. కొన్ని రోజులు ఆగితే ఆకాశం కూడా తమదేనని చైనా చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. డ్రాగన్ భూకాంక్ష ఆ రేంజ్‌లో ఉంటుంది మరి. గల్వాన్‌లో 2020 సరిహద్దు ఘర్షణల తర్వాత లడఖ్‌లో భారత్ ఎక్కువ మంది సైనికులను మొహరించింది. భారత సైనికులను తిరిగి కశ్మీర్‌కు మళ్లించడానికి చైనా ప్రయత్నిస్తోందని సమాచారం. చైనా మద్దతుతో పాకిస్థాన్ పశ్చిమంలో ఉగ్రవాదాన్ని పెంచుకుంటోందని చర్చ జరుగుతోంది. లడఖ్‌లో భారత్ సైనికుల సంఖ్యను తక్కువ చేసేలా పూంచ్‌లో పాకిస్థాన్‌తో కలిసి చైనా ఉగ్రవాదులను ఎగదోస్తుందని తెలుస్తోంది. పూంచ్-రాజౌరీలో తరచు ఉగ్రదాడులు పెరుగుతున్నాయి. అటవీ ప్రాంతాల నుంచి ఉగ్రవాదులను తరిమికొట్టేందుకు సైన్యం చేస్తున్న పోరాటం తనకు ఆపరేషన్ సర్ప్ వినాష్‌ను గుర్తుకు తెచ్చాయని రక్షణ నిపుణుడు కల్నల్ మనోజ్ కుమార్ అన్నారు . పూంచ్‌లోని సూరన్‌కోట్ ప్రాంతంలో 2003లో ఆపరేషన్ జరిగింది. జమ్మూకశ్మీర్(Jammu & Kashmir) లోని పూంచ్ జిల్లా(Poonch District)లో సైనికులను తరలిస్తున్న రెండు వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులు చేశారు. సైనికులు వెళుతున్న దారి పక్కనే ఒక కొండ ఉంది. అక్కడ ఏ మూల మూల నక్కి మరీ దాడులు చేశారు ఉగ్రవాదులు. భారత సైనికులు తేరుకుని ఎదురు దాడి జరిపేలోపు వారు అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఉగ్రవాదులు చేసిన దాడిలో ఐదుగురు సైనికులు అమరులయ్యారు. Also Read: జాక్వెలిన్ రహస్యాలన్నీ బయటపెడతా.. మాజీ ప్రేయసిపై ఆగ్రహంగా సుకేశ్! WATCH: #jammu-kashmir #poonch మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి