Chhattisgarh:తొలి విడత ఎన్నికల ముందు ఛత్తీస్‌ఘఢ్ కాంగ్రెస్ కు షాక్..సీఎం భగేల్ కు బెట్టింగ్ సొమ్ము ఛత్తీస్ ఘడ్ లో మరో రెండు రోజుల్లో మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎన్నికల్లో కూడా గెలిచి మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. రాష్ట్రంలో మహదేవ్ బెట్టింగ్ యాప్ నుంచి సీఎం బఘేల్ కు రూ.508 కోట్లు అందినట్లు ఈడీ ఆరోపిస్తోంది. By Manogna alamuru 04 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు ఛత్తీస్‌ఘఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌కు రూ.508 కోట్లు ఇచ్చారని అంటోంది ఈడీ. దీనికి సంబంధించి రూ.5 కోట్లకు పైగా నగదుతో ఒక కొరియర్ ఏజెన్సీని పట్టుకున్నట్లు ప్రకటించింది. తన వద్ద ఉన్న డబ్బును ఛత్తీస్‌ఘఢ్‌లో ఎన్నికల ఖర్చుల కోసం ఒక రాజకీయ నాయకుడు బఘేల్ కి డెలివరీ చేయడానికి పంపినట్లు కొరియర్ చేసిన వ్యక్తి ఈడీకి తెలిపాడు. రాష్ట్రంలో తొలి దశ ఎన్నికలకు నాలుగు రోజుల ముందు ఈ ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. Also Read:దేన్ని దేనికి ముడిపెట్టారురా బాబూ.. ప్రచారంలో రచ్చ చేస్తున్న ఛత్తీస్ఘడ్ కాంగ్రెస్ ఛత్తీస్‌ఘఢ్‌లో ఎన్నికలకు ముందు మహాదేవ్ యాప్ ప్రమోటర్ల ద్వారా పెద్ద మొత్తంలో నగదు తరలిస్తున్నట్లు ఈడీకి తెలిసింది. దీంతో రంగంలోకి దిగింది. నిన్న ఛత్తీస్‌ఘడ్ లోని హోటల్ ట్రిటాన్, భిలాయ్‌లోని మరొక ప్రదేశంలోనూ సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ఒక కొరియర్ ను పట్టుకుంది ఈడీ. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఖర్చు కోసం పెద్ద మొత్తంలో నగదును డెలివరీ చేయడానికి యూఏఈ నుంచి అసిమ్ దాస్ ను పంపారని ఈడీ చెబుతోంది. అసిమ్ దాస్ కారు, ఇంటి నుంచి రూ. 5.39 కోట్లు రికవరీ చేశామని, యుఎఇలో ఉన్న మహాదేవ్ యాప్ ప్రమోటర్లు ఆ డబ్బును చత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి బఘేల్ కి ఇవ్వడానికి ఏర్పాటు చేసినట్లు అతను అంగీకరించాడని ఈడీ తెలిపింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల ఖర్చులకు ఈ మొత్తం వాడబోతున్నట్లు కూడా తెలిపాడు. ఈడీ విచారణలో బెట్టింగ్ యాప్‌తో అనుసంధానించబడిన కొన్ని బినామీ బ్యాంకు ఖాతాలు కూడా కనుగొన్నారు. వాటిలో రూ.15.59 కోట్లు సీజ్ చేశారు. Also Read:కర్ణాటకలో చీకట్లు…కరెంట్ లేక అవస్థలు పడుతున్న జనాలు ఇప్పుడు ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయంగా మారింది. దీని మీద కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా స్పందించారు. కాంగ్రెస్ ప్రచారం కోసం నిధులు సమకూర్చుకునేందుకు హవాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నరని ఆరోపించారు. ఇప్పటివరకు ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ ఇలాంటిది జరగలేదని స్మృతి విమర్శించారు. ఇది కచ్చితంగా ఆందోళన చెందాల్సిన విషయమని అన్నారు. #chhattisgarh #money #cm #mahadev-betting-app #bhagel మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి